ఆత్మ కమిటీ చైర్మన్ నల్లు సుధాకర్ రెడ్డిని సన్మానించిన మహబూబాబాద్ అథ్లెటిక్ అసోసియేషన్
మహబూబాబాద్ ప్రతినిధి, (జనంసాక్షి): ఆత్మ కమిటీ చైర్మన్ గా మరిపెడ మండలం గిరిపురం రైతు వేదికలో ఆత్మ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టిన సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు నల్లు సుధాకర్ రెడ్డిని మహబూబాబాద్ పట్టణ కేంద్రంలోని శ్రీ తిరుమల గార్డెన్స్ లో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మహబూబాబాద్ అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షులు లయన్ బొడ్డుపెల్లి ఉపేంద్రం ఆధ్యక్షతన జరిగిన కార్యక్రమనికి ముఖ్య అతిథి కాంగ్రెస్ పార్టీ పట్టణ అద్యక్షులు ఘనపురపు అంజయ్య జాతీయ బిసి సంఘం మహబూబాబాద్ జిల్లా అద్యక్షులు బండారు వెంకట రమణలు పాల్గొని ఘనంగా సన్మానించడం జరిగింది ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. డోర్నకల్ నియోజకవర్గ ప్రజలకు సుపరిచితులుగా అందరి మన్ననలు పొందిన నల్లు సుధాకర్ రెడ్డిని ఆత్మ కమిటీ చైర్మన్ గా డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్ నియమించడం పట్ల రామచంద్రనాయక్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని ఆత్మ కమిటీ చైర్మన్ గా బాధ్యతలు చేపట్టిన నల్లు సుధాకర్ రెడ్డి కి అభినందనలు తెలియజేస్తున్నామని వారు అన్నారు.ఈ కార్యక్రమంలో అంబెడ్కర్ సంఘం జిల్లా అద్యక్షులు కామ సంజీవరావు మాజీ వైస్ చైర్మన్ ఎండి ఫరిద్ సీనియర్ వాకర్ మాచర్ల రమేష్ ఎబిఎస్ఎఫ్ రాష్ట్ర అద్యక్షులు ఇనుగుర్తి సుధాకర్ ఉషోదయ ప్రెసిడెంట్ పాలబిందెల మల్లయ్య మెకానిక్ సంఘం జిల్లా అద్యక్షులు మండ విక్రమ్ గౌడ్ మామిండ్ల నర్సింహా రావు ఎల్ఐసి ఏజెంట్ తీగల రాజేందర్ సీఐటీయూ నాయకులు నాగన్న మెడికల్ రవి ముద్దంగుల మల్లేష్ పాల్గొన్నారు.