మాజీ ఎమ్మెల్యే రేగా ను కలిసిన మహంకాళి రామారావు, కనకాచారి

బూర్గంపహడ్ జనవరి 03 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా :- పినపాక మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు ని మణుగూరు క్యాంప్ కార్యాలయంలో శనివారం ఉపసర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి రామారావు, బీసీ సంఘం జిల్లా కార్యదర్శి బెజ్జంకి కనకాచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు ని పూల బొకేతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దివ్య ప్రసాదాన్ని అందజేశారు. ఈ భేటీలో నూతన సంవత్సరంలో ప్రజాసేవ కార్యక్రమాలు మరింత బలోపేతం చేయాలన్న అంశాలపై చర్చ జరిగినట్లు తెలిపారు. ఈ సందర్భంగా రేగా కాంతారావు మాట్లాడుతూ నూతన సంవత్సరం అందరికీ ఆరోగ్యం, సుఖసంతోషాలు తీసుకురావాలని ఆకాంక్షించారు. గ్రామస్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ప్రజా సమస్యల పరిష్కారానికి అందరూ ఐక్యంగా పనిచేయాలని సూచించారు. ప్రజాసేవే లక్ష్యంగా ఉపసర్పంచ్‌లు, సంఘాల నాయకులు ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.



