భూ వివాదాలతో వ్యక్తి దారుణ హత్య

రాష్ట్రంలో రోజురోజుకు కాంగ్రెస్‌ గుండాల దాడులు పెరిగిపోతున్నాయి. రేవంత్‌ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణిస్తున్నాయి. ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేసిన వారిపై తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపడం లేదంటే భౌతికంగా నిర్మూలించటం వంటి ఆగడాలు మితిమీరిపోతున్నాయి. రోజుకో చోట దాడులకు దిగుతూ రాష్ట్రంలో భయానక వాతావరణం సృష్టిస్తున్నారు.తాజాగా వరంగల్ జిల్లా రాయపర్తి మండలంలోని బురహాన్ పల్లి గ్రామ తాజా మాజీ సర్పంచ్  సూదుల దేవేందర్ రావురాత్రి తన ఇంట్లో హత్యకు గురైనట్లు సమాచారం. మృతుడు దేవేందర్ రావు ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరారు. హత్యకు రాజకీయ కక్షలు, భూవివాదం కారణమని తెలిసింది. హంతకులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారేనని సమాచారం. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.