శ్రీ ముత్యాలమ్మ జాతర మహోత్సవములో పాల్గొన్న మంత్రి పొంగులేటి

బూర్గంపహాడ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (జనంసాక్షి) : బూర్గంపహడ్ మండలం గౌతమిపురం లో బీటీ రోడ్డు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక మండలం సారపాక ముత్యాలంపేటలో కొలువై ఉన్న శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి ప్రథమ జాతర మహోత్సవంలో తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పాల్గొని, శ్రీముత్యాలమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. వారి వెంట జిల్లా కలెక్టర్ జితేష్ వి పటేల్, భద్రాచలం ఐ టి డి ఏ పీవో బి రాహుల్ వున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, మహిళ నాయకులు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.