దేశాయి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే:ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి 

బోధన్, (జనంసాక్షి) : బోధన్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ న్యాయవాది వెంకటేశ్వర దేశాయి కుటుంబాన్ని బుధవారం బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించారు. దేశాయి కుమారుడు ప్రీతం దేశాయి ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలిసిందే. ఈ మేరకు నేడు వెంకటేశ్వర దేశాయితో పాటు బోధన్ మాజీ మున్సిపల్ చైర్మన్ సునీత దేశాయి వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజామాబాద్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నగేష్ రెడ్డి, టిపిసిసి డెలిగేట్ గంగాశంకర్, సీనియర్ నాయకులు, నాగేశ్వరరావు, దాము, బ్లాక్ ప్రెసిడెంట్, నరేందర్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.