కీలకభాజపా నేతలకు.. కొసరుశాఖలు మిత్ర పక్షాలకు..
` కేంద్రమంత్రులకు శాఖల కేటాయింపు
` పాతవారికి తిరిగి అవే శాఖలు
` హోంమంత్రిగా అమిత్ షా.. రాజ్‌నాథ్‌కు రక్షణశాఖ
` నిర్మలకు ఆర్థిక శాఖ,..జైశంకర్‌కు విదేశాంగ శాఖ
` నితిన్ గడ్కరీకి రోడ్డురవాణా…అశ్వినీ వైష్ణవ్‌కు రైల్వే
` రామ్మోమన్ నాయుడుకు పౌరవిమానయానం
` కిషన్‌రెడ్డికి గనుల శాఖ..బండికి హోశాఖ సహాయం
` దక్షిణాది మంత్రులకు అప్రధాన శాఖలు
` ఉత్తరాది వారికే పెద్దపీట వేసిన మోడీ
` బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోడీ
` స్వాగతించిన కార్యాలయ సిబ్బంది
` పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం
` ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందన్న ప్రధాని
న్యూఢల్లీి(జనంసాక్షి):ప్రధాన పోర్టుఫోలియోలను ప్రధాని బిజెపి నేతలకే కేటాయించారు. దక్షిణాది రాష్టాల్రకు అప్రధాన కేటాయింపులు చేశారు. కేవలం ఉత్తరాది వారికే ప్రధాన శృాఖలు కేటాయించడం గమనించవచ్చు. అలాగే పాతవారికి పాతశాఖలనే కేటాయించడం విశేషం. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, నిర్మలా సీతారామన్, నితన్ గడ్కరీలకు గతంలో నిర్వహించిన శాఖలనే కేటాయించారు. అమిత్ షాకు హోం, నిర్మలకు ఆర్థికశాఖ, నితిన్ గడ్కరీకి రోడ్డు,రవాణా, రాజ్‌నాథ్‌కు రక్షణశాఖలను కేటాయించారు. ఈమేరకు కొత్త మంత్రులకు శాఖలు కేటాయిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. టిడిపి నుంచి కొతత్గా కేబినేట్‌లో చేరిన రామ్మోమన్ నాయుడుకు కేంద్ర విమానయాన శాఖను కేటాయించారు. ఇప్పటి వరకు దీనిని జ్యోతిరాదిత్య నిర్వహించారు. భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీకి మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జై శంకర్‌కు మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే ఇచ్చారు. తెలుగు రాష్టాల్ర నుంచి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహాయ మంత్రులుగా, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. వీరికి తాజాగా కేటాయింపులు జరిపారు. తర మంత్రుల శాఖలు ఇలావున్నాయి. రాజ్‌నాథ్ సింగ్ (భాజపా)` రక్షణ శాఖ, అమిత్ షా (భాజపా)` హోంమంత్రిత్వ శాఖ, నితిన్ గడ్కరీ (భాజపా)` రోడ్లు, రహదారులు, జగత్ ప్రకాశ్ నడ్డా (భాజపా)` ఆరోగ్యశాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్ (భాజపా)` వ్యవసాయం, రైతు సంక్షేమం, నిర్మలా సీతారామన్ (భాజపా)` ఆర్థికశాఖ, సుబ్రహ్మణ్యం జైశంకర్ (భాజపా)` విదేశీ వ్యవహారాలు, మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (భాజపా)` విద్యుత్, గృహనిర్మాణశాఖ, హెచ్.డి. కుమారస్వామి (కొత్త) (జేడీఎస్)` భారీ పరిశ్రమలు, ఉక్కు పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (భాజపా)` కామర్స్ అండ్ ఇండస్ట్రీస్, ధర్మేంద్ర ప్రధాన్ (భాజపా) ` విద్యాశాఖ, జీతన్ రామ్ మాంరిa (హెచ్‌ఎఎం) `వంటి శాఖలను కేటాయించారు. కిషన్ రెడ్డికి బొగ్గుగనుల శృాఖను కేటాయించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి ` బండి సంజయ్,గనుల శాఖ ` కిషన్ రెడ్డి రోడ్డు రవాణా శాఖ సహాయమంత్రులు ` అజయ్ టమ్టా, హర్ష్ మల్హోత్రా, గృహ నిర్మాణ శాఖ, పట్టణాభివృద్ధి ` నమోహర్ లాల్ ఖట్టర్, పెట్రోలియం శాఖ ` హర్దీప్ సింగ్ పూరి, రైల్వే, సమాచార, ప్రసార శాఖ ` అశ్వినీ వైష్ణవ్, వాణిజ్యం ` పీయూష్ గోయల్,పౌర విమానాయన శాఖ ` రామ్మోహన్ నాయుడు, గజేంద్ర షెకావత్`సాంస్కృతిక పర్యాటక శాఖ, భూపేంద్ర యాదవ్` పర్యావరణ శాఖ,క్రీడలు` చిరాగ్ పాశ్వాన్ కిరణ్ రిజుజు` పార్లమెంటరీ వ్యవహరాలు, మన్‌సుఖ్ మాండవీయా ` కార్మిక శాఖ, క్రీడలు భూపేందర్ యాదవ్ ` పర్యావరణ శాఖ,సీఆర్ పాటిల్ ` జల్ శక్తి శాఖ లను కేటాయించారు.
బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోడీ
భారత ప్రధానిగా నరేంద్రమోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. దిల్లీలోని సౌత్‌బ్లాక్‌లోని పీఎంఓ కార్యాలయంలో మూడో దఫా తన విధుల్ని మొదలుపెట్టేశారు. ఈ సందర్భంగా రైతులకే తొలి ప్రాధాన్యం ఇచ్చారు. పీఎం కిసాన్ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం చేశారు. దీంతో 9.3 కోట్లమంది రైతులకు రూ.20వేల కోట్ల ఆర్థిక సహాయం అందుతుంది. మా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలి సంతకం వారి సంక్షేమానికి సంబంధించినదే కావడం విశేషం. రాబోయే రోజుల్లో వ్యవసాయరంగానికి, కర్షకుల సంక్షేమంపై మా ప్రభుత్వం మరింత దృష్టి సారించనుందని సంతకం చేసిన తర్వాత మోదీ వెల్లడిరచారు. ఇదిలా ఉంటే.. ఈరోజు మోదీ క్యాబినెట్ తొలి సమావేశం జరగనుంది. పార్లమెంట్ సమావేశాలను ఏర్పాటు చేయాలని రాష్ట్రపతి ద్రౌపదిముర్మును అభ్యర్థించనుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వేళ జరగబోయే సమావేశాల ప్రారంభం రోజున రెండు సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగిస్తారు. ఈ ప్రభుత్వ దార్శనికత, ప్రాధాన్యతలను పేర్కొంటారు. 2014, 2019 ఎన్నికల్లో విజయం తర్వాత రెండుసార్లు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన మోదీ.. తాజా ఎన్నికల్లో కూటమి విజయదుందుభితో వరసగా మూడోసారి పీఠమెక్కిన ఘనత సాధించారు. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత దేశంలో వరసగా మూడోసారి ప్రధాని అయిన ఘనతను సొంతం చేసుకున్నారు. తాజా కేంద్ర సర్కార్ 71 మంది మంత్రులతో కొలువుదీరింది. అందులో 30 మంది క్యాబినెట్ మంత్రులుగా ఉన్నారు.భారతదేశ ప్రధానిగా నరేంద్ర మోదీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఢల్లీిలోని పార్లమెంట్ సౌత్ బ్లాక్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆయన మూడోసారి తన విధుల్ని నిర్వర్తించేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా పీఎంవోలోని ఉద్యోగులు, సిబ్బంది ఆయనకు సాదరంగా స్వాగతం పలికారు. వారందరికీ అభివాదం చేస్తూ ఆయన ముందుకు సాగారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం సాయంత్రం ఆయన మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. మోదీతో పాటు 71 మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.ఈ క్రమంలో పీఎం కిసాన్ నిధి 17వ విడత నిధుల విడుదల దస్త్రంపై తొలి సంతకం చేశారు. దీంతో 9.30 కోట్ల మంది రైతులకు రూ.20 వేల కోట్ల ఆర్థిక సాయం అందుతుంది. తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ఆయన అన్నారు. ’రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి మరింత కృషి చేస్తాం. మాది కిసాన్ కళ్యాణ్‌కు పూర్తిగా కట్టుబడి ఉన్న ప్రభుత్వం.. అందువల్ల బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంతకం చేసిన మొదటి ్గªల్ రైతు సంక్షేమానికి సంబంధించినది కావడం సముచితం.’ అని ప్రధాని పేర్కొన్నారు.
కలిసి పనిచేద్దాం..అభివృద్ది సాధిద్దాం
మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత నరేంద్రమోదీ పీఎంఓ సిబ్బందితో మాట్లాడారు. ప్రభుత్వం అంటే మోదీ ఒక్కరే కాదని, ఎంతోమంది ఆలోచనల సమాహారమని అన్నారు. పదేళ్ల క్రితం పీఎంఓ అంటే ఒక అధికార కేంద్రం అనే భావన ఉండేదన్నారు. అలాగే తాను నిత్యం ఉత్సాహంగా ఉండటానికి గల రహస్యాన్ని వెల్లడిరచారు. ‘పీఎంఓ ఒక అధికార కేంద్రంలా ఉండాలన్నది నా విధానం కాదు. నేను అధికారం కోసం జన్మించలేదు. 2014కు ముందున్న భిన్నమైన పరిస్థితులను మార్చే దిశగా నిర్ణయాలు తీసుకున్నాం. పీఎంఓ ఎప్పుడూ ప్రజల కోసం పని చేయాలి. అది మోదీ పీఎంఓగా ఉండకూడదు. మనందరి లక్ష్యం.. దేశమే ప్రథమం, మనందరి మోటివేషన్.. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించుకోవడం. 2047 కోసం నిర్విరామంగా పని చేస్తానని దేశ ప్రజలకు హావిూ ఇచ్చాను. నా బృందం నుంచి నాకు అలాంటి అంచనాలే ఉన్నాయి. మనం సమయం చూసుకొని, కాలానికి కట్టుబడి పనిచేసే వ్యక్తులం కాదు. మన ఆలోచనలకు పరిమితి లేదు. ఇలాంటి పరిమితులు లేకుండా పని చేసేవారే నా జట్టు సభ్యులు. వారినే ఈ దేశం విశ్వసిస్తుంది. ఈ పది సంవత్సరాల్లో నేను ఆలోచించిన దానికంటే ఎక్కువ ఆలోచించడం. నేను చేసిన దానికంటే ఇంకా ఎక్కువ చేయడం నా బాధ్యత అని నేను అనుకుంటున్నాను. జీవితంలో మనం నేరవేర్చుకోవాలనుకున్న కోరిక స్థిరంగా ఉన్నప్పుడు.. కాలక్రమంలో దానికి స్థిరత్వం వస్తుంది. అప్పుడు దానిని నెరవేర్చుకునే క్రమంలో అది ఒక తీర్మానంగా మారుతుంది. ఆ తీర్మానానికి కఠోర శ్రమ కలిస్తే.. విజయంగా మారుతుంది. ప్రతిఒక్కరూ నా ఎనర్జీకి కారణమేంటని అడుగుతుంటారు. ప్రతి వ్యక్తి తన లోపలి విద్యార్థిని సజీవంగా ఉంచితే.. ఎప్పటికీ శక్తిహీనుడు కాడు‘ అంటూ తనలోని ఉత్సాహానికి గల కారణం చెప్పారు. తన ప్రసంగం ద్వారా సిబ్బందిలో ప్రేరణ నింపారు.
పేదలకు పెద్దపీట
` వారికోసం 3కోట్ల ఇళ్ల నిర్మాణం..
` తొలి కేబినేట్‌లో ప్రధాని మోడీ నిర్ణయం
న్యూఢల్లీి(జనంసాక్షి): కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ ప్రభుత్వం పేదల కోసం 3 కోట్ల ఇళ్లను నిర్మించనున్నది. ప్రధాని మోదీ నివాసంలో సోమవారం సాయంత్రం జరిగిన తొలి కేబినెట్ సమావేశంలో ఈ మేరకు తొలి నిర్ణయం తీసుకున్నది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రావిూణ, పట్టణాల్లో మరో మూడు కోట్ల గృహాల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వ సహాయాన్ని కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. ’అర్హత ఉన్న కుటుంబాల సంఖ్య పెరిగిన నేపథ్యంలో గృహ అవసరాలను తీర్చడానికి గ్రావిూణ, పట్టణ కుటుంబాలకు మూడు కోట్ల అదనపు ఇళ్ల నిర్మాణం కోసం సహాయం అందించాలని ఈ రోజు జరిగిన కేబినెట్ సమావేశంలో నిర్ణయించారు’ అని అధికారులు తెలిపారు.కాగా, 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం 2015`16 నుంచి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని అమలు చేస్తుంది. అర్హులైన గ్రావిూణ, పట్టణ ప్రజలకు గృహాల నిర్మాణం కోసం ఆర్థిక సహాయం అందిస్తోంది. గత పదేళ్లలో ఈ పథకం కింద పేద కుటుంబాల కోసం 4.21 కోట్ల గృహాలను నిర్మించారు.