అయ్యప్పస్వామి విషు పూజ వేడుకలో ఎంపి డికె. అరుణ, ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్ , ఏప్రిల్ 14 (జనంసాక్షి) : శబరిమల వాసుడు శ్రీ మణికంఠుడు శ్రీ శ్రీ శ్రీ అయ్యప్ప స్వామి జన్మదినం సందర్భంగా విషు పూజ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. మక్తల్ పట్టణంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో అఖిలభారత అయ్యప్ప దీక్ష ప్రచార సేవా సమితి ఆధ్వర్యంలో అయ్యప్పస్వామి విషు పూజ సందర్భంగా సోమవారం రోజు స్వామివారికి అభిషేకాలు అలంకరణ విశేష పూజా కార్యక్రమాలు కొనసాగాయి. తెల్లవారుజామున 5 గంటలకు పూజా కార్యక్రమాలను చేపట్టారు. అయ్యప్ప స్వామి విషు పూజా వేడుకలకు పాలమూరు పార్లమెంటు సభ్యులు డీకే అరుణ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వాకిటి శ్రీహరి పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించి మొక్కలు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలను ఆలయ కమిటీ అధ్యక్షులు చంద్రకాంత్ గౌడ్ గురుస్వాములు అశోక్ గౌడ్, తాళంపల్లి అనిల్ కుమార్, అమరచింత శివరాం, శ్రీధర్ గౌడ్ లు శాలువాలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. విషు పూజ సందర్భంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు భజనలు అయ్యప్ప నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. మధ్యాహ్నం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పి. నరసింహ గౌడ్ ధనలక్ష్మి దంపతులు స్వామి వారికి విషు పూజ సందర్భంగా అన్నదాన కర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య, రాష్ట్ర అధికార ప్రతినిధి శంకరోళ్ళ రవికుమార్, జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, నాయకులు కర్ని స్వామి , నరసింహారెడ్డి, జి. బలరాంరెడ్డి, బి .రాజశేఖర్ రెడ్డి, కే .సోమశేఖర్ గౌడ్, చీరాల సత్యనారాయణ,ఎం. ప్రతాప్ రెడ్డి, కనకరాజు, మల్లేష్ ,స్వాగత్ సత్యనారాయణ,జయానందన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు చంద్రకాంత్ గౌడ్, బి .గణేష్ కుమార్, కట్ట సురేష్ కుమార్, కావలి ఆంజనేయులు, గోవర్ధన్, మొగిలి గంగాధర్ గౌడ్,పసుల రంజిత్ రెడ్డి, వల్లంపల్లి లక్ష్మణ్, మాజీ మార్కెట్ చైర్మన్ కె.రాజేష్ కుమార్ గౌడ్ ,బిఆర్ఎస్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, కొత్త కాపు గోవర్ధన్ రెడ్డి,బండారి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పి నరసింహ గౌడ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.