నడికూడ మండల సర్పంచ్ ల ఫోరం ఎన్నిక

 

 

 

 

 

 

 

నడికూడ, జనవరి 3(జనం సాక్షి):

అధ్యక్షుడిగా రవీందర్ యాదవ్

ఉపాధ్యక్షుడిగా జగత్ ప్రకాష్

పరకాల శాసనసభ సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు నడికూడ మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో నార్లపూర్ గ్రామ సర్పంచ్ పెద్ద బోయిన రవీందర్ యాదవ్ ను నడికూడ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణాపురం సర్పంచ్ పెండ్లి లక్ష్మి, కార్యదర్శిగా కొంగటి తిరుపతి, ఉపాధ్యక్షుడిగా రాయపర్తి సర్పంచ్ రాజ జగత్ ప్రకాష్ లను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమంలో నడికూడ సర్పంచ్ కుడ్ల మల్లాల్ రావు, చర్లపల్లి రేణుక, చోటుపర్తి రూప, ధర్మారం ఎల్లస్వామి, కౌకొండ ఓదెల శ్రీలత, ముస్తాల పెళ్లి వెంకటేష్, నర్సక్కపల్లి ముత్యాలు, పులిగిల్ల రాధ, సర్వాపూర్ శ్రీలత, వరికోల్ కుమారస్వామి, కంటాత్మకూర్ తిరుపతి, రాయపర్తి రాజ జగత్ ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.నడికూడ మండల యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు అప్పం కుమార్ స్వామితో పాటు వివిధ గ్రామాల, మండల స్థాయి నాయకులు హాజరయ్యారు.
నూతనంగా ఎన్నికైన పదాధికారులను అభినందిస్తూ, మండల అభివృద్ధికి సమిష్టిగా పనిచేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు.