శ్రీ మాధవి పాఠశాలలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు

ఎడపల్లి, జనవరి 5 ( జనంసాక్షి ) : ఎడపల్లి మండల కేంద్రంలోని శ్రీ మాధవి పాఠశాల సోమవారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా బోధన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, విద్యార్థులకు రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నియమాల పాటింపు, హెల్మెట్ మరియు సీట్‌బెల్ట్ వాడకం ప్రాముఖ్యతపై వివరించారు. చిన్న వయస్సు నుంచే రోడ్డు భద్రతపై అవగాహన కలిగి ఉండాలని, నిబంధనలు పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ, పాఠశాల యాజమాన్యం మాధవి సురేష్ గౌడ్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

