నిజామాబాద్ డిపో అర్ఎం రిలీవ్ చేయట్లేదు

ఆర్మూర్, జూలై 10 ( జనం సాక్షి): నిజామాబాద్ 2 ఆర్టీసీ డిపోలో బస్ డ్రైవర్ గా విధులు నిర్వహిస్తున్న షేక్ ఇమామ్ సాహెబ్ బస్సును ఆర్మూర్ బస్టాండ్ లో ఆపి ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి.. ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ డిపోలో సిబ్బంది అధికంగా ఉండడంతో షేక్ ఇమామ్ సాహెబ్ ను మూడు సంవత్సరాల క్రితం నిజామాబాద్ డిపోకు ట్రాన్స్ఫర్ చేశారు.కేవలం 6 నెలలకే అని చెప్పి సుమారు మూడు సంవత్సరాలు గడుస్తున్న నిజామాబాద్ డిపోలోనే ఆర్టీసీ బస్ డ్రైవర్ గా విధులు కొనసాగిస్తున్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారి ఖమ్మం జిల్లాలో విధుల్లో చేరాలని బదిలీ ఉత్తర్వులు పంపించారు.కాగా ఆర్టీసీ నిజామాబాద్ డిపో ఆర్ఎం లీవ్ చేయట్లేదని కలత చెందాడు.దీంతో నిజామాబాద్ నుండి నిర్మల్ వైపుగా విధుల్లో భాగంగా ప్రయాణిస్తున్న ఆర్టీసీ డ్రైవర్ ఆర్మూర్ బస్టాండ్ లో బస్సును ఆపి,కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటున్నానని కలత చెంది ఎలుకల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు.దీనిని గమనించిన డ్రైవర్లు,ఆర్టీసీ కార్మికులు హుటాహుటిన షేక్ ఇమామ్ సాహెబ్ ను ఆర్మూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.