ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదు

 

నిరూపించిన మారుమూల తాండ యువతి

నిజామాబాద్ సిటీ ఏప్రిల్ 04: (జనం సాక్షి ) సిరికొండ

కష్టపడి చదివితే సాధించలేనిది ఏమీ లేదని ఎదుగుదలకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది\నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం కొండాపూర్ గ్రామం సర్పంచ్ తండా కి చెందిన యువతి మాలవత్ సుగుణ. పట్టుదలతో చదివి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)లో క్లర్క్ ఉద్యోగాన్ని సాధించి విశేష ప్రతిభ కనబరిచారు.పేద కుటుంబంలో జన్మించిన ఆమె, ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటూనే చదువును కొనసాగించి ఈ స్థాయికి చేరుకోవడం గమనార్హం.సుగుణ చిన్ననాటి నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ, తన లక్ష్యంపై దృష్టి పెట్టి కృషి చేసింది. పోటీ పరీక్షల్లో విజయం సాధించి బ్యాంకింగ్ రంగంలో అడుగుపెట్టడం ఆమె పట్టుదలకు నిదర్శనం.ఈ విజయంతో ఆమె తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు గర్వకారణంగా నిలిచింది. అదనంగా,ఆమెకు సొంత జిల్లా అయిన నిజామాబాద్‌లోనే పోస్టింగ్ రావడం మరింత సంతోషకరం. స్థానిక ప్రజలు,బంధుమిత్రులు ఆమె విజయాన్ని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.మాలవత్ సుగుణ సాధించిన ఈ విజయం సమాజానికి ఒక మంచి సందేశాన్ని ఇస్తోంది పరిస్థితులు ఎలా ఉన్నా, కష్టపడి ప్రయత్నిస్తే విజయాన్ని సాధించవచ్చని ఆమె మరోసారి నిరూపించారు