రైతులు ఐక్యంగా ఉంటేనే లాభసాటి వ్యవసాయం: ఎమ్మెల్యే గండ్ర

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రైతులు ఐక్యంగా ఉంటేనే లాభసాటి వ్యవసాయం చేయొచ్చని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు రైతు వేదికలో గురువారం సహకార భావం – రైతు బలం, ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై మాట్లాడుతూ రైతు సింగిల్ గా ఉంటే సరైన సమయానికి సరైన ఆలోచన రాకపోవచ్చన్నారు. రైతులందరూ సమిష్టిగా ఉంటే ఒకరి ఆలోచన మరొకరికి పంచే అవకాశం ఉంటుందని, ఇలాంటి పరిస్థితులకనుగుణంగా వ్యవసాయం చేస్తే అందరికీ ప్రయోజనం ఉంటుందన్నారు. రైతు శక్తి ఎంతో గొప్పదని, రైతుల ఐక్యతతోనే వ్యవసాయం లాభసాటిగా మారుతుందని పేర్కొన్నారు. సహకార సంఘాల బలోపేతం, రైతుల ఐక్యత, ఎఫ్‌పీఓల ద్వారా సమిష్టి మార్కెటింగ్, ఆధునిక వ్యవసాయ పద్ధతుల వినియోగం ద్వారా రైతులు ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి, పీఏసీఎస్ చైర్మన్‌లు, డైరెక్టర్లు, చెల్పూర్ సర్పంచ్, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

తాజావార్తలు