కొల్చారంలో ప్రోటోకాల్ కొట్లాట

కొల్చారం : మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని కొల్చారం మండలంలో రాష్ట్ర దేవాదాయ అడవి శాఖ మంత్రి కొండా సురేఖ పర్యటనలో ప్రోటోకాల్ వివాదం నెలకొంది. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం ప్రారంభోత్సవానికి విచ్చేసిన కొండా సురేఖ కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారు. సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకరికొకరు నినాదాలు చేసుకుంటూ సభలో తోసేసుకున్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఇరువర్గాలకు నచ్చజెప్పి శాంతింపచేశారు.