యశోదలో కోమా పేషెంట్ కు అరుదైన శస్త్ర చికిత్స, ప్రాణాలు కాపాడిన ప్రముఖ వైద్యులు

నిజామాబాద్ సిటీ మే15: జనం సాక్షి: రోడ్డు ప్రమాదానికి గురై కోమాలో ఉన్న పేషెంట్ కు సికింద్రాబాద్ లోని యశోద ఆసుపత్రి లో అరుదైన శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడారు. దీనికి సంబంధించిన వివరాలను యశోద ఆసుపత్రి ప్రముఖ న్యూరో సర్జన్ కె ఎస్ కిరణ్ శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.ఈ మేరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని యశోద మెడికల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ కె ఎస్ కిరణ్ మాట్లాడుతూ శస్త్ర చికిత్స సంబంధించిన వివరాలను వెల్లడించారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గానికి చెందిన సుద్ధులం గ్రామ నివాసి 35 సంవత్సరాల జక్కు ప్రశాంత్ గత సెప్టెంబర్ మాసంలో విధులు నిర్వహించుకొని ఇంటికి వెళుతున్న సమయంలో రోడ్డుపైన కుక్క అడ్డం వచ్చి కింద పడటంతో తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాద సమయంలో హెల్మెట్ ధరించకపోవడంతో తలకు, ముఖానికి తీవ్ర గాయాలై కోమలోకి వెళ్లాడన్నారు. ప్రాణపాయ స్థితిలో ఉన్న అతన్ని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తీసుకువచ్చారన్నారు. రెండు నెలలు కొమలో ఉన్న పేషెంట్ ని అత్యాధునిక పరికరాలతోటీ సి డి , (ట్రాన్స్ క్లీనల్ డాప్లర్,) ఐ సి పీఎం(ఇంట్రా క్రినల్ ప్రెషర్ మానిటరింగ్ ) ఎం ఆర్ ఐ, డీ టి ఐ , ఇమేజెస్ అండ్ పర్ఫ్యూజన్ స్కామ్స్ పలు రకాల శస్త్ర చికిత్సలు నిర్వహించడం జరిగిందన్నారు. రెండు నెలల చికిత్స అనంతరం రోగి సంపూర్ణ ఆరోగ్యంగా బయటపడ్డారన్నారు. గ్రేడ్ త్రి హెడ్ ఇంజురీ కారణంగా పేషంటు ప్రమాదం జరిగిన వెంటనే కోమలకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. గ్రేడ్ వన్, గ్రేడ్ 2 ప్రమాదాలు స్వల్ప గాయాలతో ప్రాణాపాయ స్థితి నుండి బయట పడవచ్చని గ్రేట్ త్రీ వల్ల అత్యంత ప్రమాదకరం కావడంతో అత్యాధునిక పరికరాలతో చికిత్స నిర్వహించి ప్రాణాలు కాపాడడం జరిగిందన్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించి ప్రయాణం చేస్తే ప్రమాదం జరిగిన ఎలాంటి ప్రాణహాని ఉండదన్నారు. అనంతరం పేషంట్ ప్రశాంత్ మాట్లాడుతూ, తనకు పునర్జన్మ ని ఇచ్చిన డాక్టర్ కె. ఎస్ కిరణ్ తనకు దైవంతో సమానం అన్నారు. తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ కు జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ విలేఖరుల సమావేశంలో ఆస్పత్రి మార్కెటింగ్ మేనేజర్ శ్రీరామ్ సురేష్ పాల్గొన్నారు.