కాళేశ్వరంపై నివేదిక పూర్తి!
` ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందజేత
హైదరాబాద్(జనంసాక్షి): కాళేశ్వరంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిటీ నివేదిక దాదాపు సిద్ధమైంది. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి అందించే అవకాశముంది. విచారణలో భాగంగా ఇప్పటి వరకు మొత్తం 115 మందిని కమిషన్ ప్రశ్నించి, వాంగ్మూలాలను నమోదు చేసింది. అంతేకాకుండా మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ప్రాజెక్టులపై ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం అందించిన వివరాలను కూడా క్రోడీకరించి పూర్తి నివేదికను సిద్ధం చేసి.. ఈ నెలాఖరు కల్లా ప్రభుత్వానికి అందించనుంది