హింసా ద్వేషాలను రెచ్చగొట్టే మీరు హిందువెట్లైతరు?

` లోక్‌సభలో రాహుల్‌ ఫైర్‌
` దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషిచేసింది
` నోట్ల రద్దు, జిఎస్టీతో దేశం అతలాకుతలం
` నీట్‌ పరీక్షలో అవతవకలపై ఎందుకు చర్చించరు?
` అధికార బీజేపీని ఏకిపారేసిన విపక్షనేత
` ప్రధాని మోదీపై తీవ్ర విమర్శలు
` లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం
న్యూఢల్లీి(జనంసాక్షి):లోక్‌సభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై రాహుల్‌గాంధీ చేసిన ప్రసంగంపై రచ్చ రాజుకుంది. లోక్‌ సభలో ప్రతిపక్ష నేతగా తన తొలి ప్రసంగంతోనే బీజేపీపై పదునైన విమర్శనాస్త్రాలు సంధించారు. బీజేపీని, ప్రధాని మోదీని టార్గెట్‌ చేస్తూ రాహుల్‌గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. శివుడి నుంచి తాను ప్రేరణ పొందానని , శివుడి ఫోటోను రాహుల్‌ గాంధీ లోక్‌సభలో చూపించారు. అయితే స్పీకర్‌ అభ్యంతరం తెలిపారు. శివుడి ఫోటోను చూపిస్తే తప్పవుతుందా..? అని రాహుల్‌ ప్రశ్నించారు. శివుడు శాంతికి ప్రతీక, హింసకు వ్యతిరేకమని.. బీజేపీ హిందువులకు వ్యతిరేకమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు రాహుల్‌. భగవాన్‌ శివుడి నుంచి తాను ప్రేరణ పొందినట్టు తెలిపారు. దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీపేర్కొన్నారు. భారత్‌ అనే భావన, రాజ్యాంగంతోపాటు భాజపా ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాదిమందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు. తానూ బాధితుడినేనని.. తనపై 20కిపైగా కేసులు మోపారన్నారు. నాకు రెండేళ్ల జైలుశిక్ష పడిరది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నా అని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్‌ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందని పేర్కొంటూ.. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ’సత్యం’ ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీ మాట్లాడుతుండగా ప్రధాని సహా భాజపా ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలపడం గమనార్హం. ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ.. సభలో కొన్ని ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్‌ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్‌ తెలిపారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటి చెబుతున్నాయన్నారు. రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదు. ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన ’నీట్‌’ను కమర్షియల్‌గా మార్చారు. గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదు. భాజపా హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధాని చెప్పారు. భాజపా ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసింది. అల్లర్లతో మణిపుర్‌ అట్టుడికి పోయినా.. ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదు. అక్కడ నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసింది. నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారు. వీటి వల్ల దేశప్రజలకు కలిగిన లాభం ఏంటని విపక్షనేత రాహుల్‌ ప్రశ్నించారు. హిందుత్వ పేరుతో దేశ ప్రజలను బీజేపీ భయపెడుతోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ మణిపూర్‌ ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. మణిపూర్‌లో అంతర్యుద్దం జరుగుతుందన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గాలికొదిలేశారని పేర్కొన్నారు. బడా పారిశ్రామికవేత్తల కోసమే పనిచేస్తున్నారని పైర్‌ అయ్యారు. తాను దేవుడితో నేరుగా మాట్లాడతానని మోదీ చెప్పారు.. నోట్ల రద్దు చేయాలని దేవుడే మోదీకి చెప్పి ఉంటారంటూ రాహుల్‌ పేర్కొన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలను సర్వనాశనం చేశారని.. ఉద్యోగాలు లేక యువత అల్లాడుతోందన్నారు. అగ్నివీర్‌ పథకంపై తీవ్ర విమర్శలు చేశారు. అగ్నివీర్‌ జవాన్లు యుద్దంలో చనిపోతే అమర జవాన్‌ హోదా లభించదన్నారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే అగ్నివీర్‌ పథకాన్ని రద్దు చేస్తామన్నారు. ఈ సారి గుజరాత్‌ లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని.. రాసిపెట్టుకోండంటూ రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. రైతులను పట్టించుకోలేదని.. 700 మంది చనిపోయారని తెలిపారు. అయోధ్యలో భూముల్ని లాక్కొని విమానాశ్రయం నిర్మించారంటూ ఆరోపించారు. అయోధ్య బీజేపీ సొత్తు కాదని,.. ఇదే అంశాన్ని ప్రజలు ఎన్నికల్లో ప్రూవ్‌ చేసారని అన్నారు.అయోధ్యలో ప్రజల్ని మందిరం దగ్గరకు కూడా రానివ్వలేదని మండిపడ్డారు. అయోధ్య ఓపెనింగ్‌ కి కార్పొరేట్‌ పెద్దలను మాత్రమే ఆహ్వానించారని అన్నారు.అక్కడ అంబానీ, అదానీలు మాత్రమే ఉన్నారని అన్నారు. రామజన్మ భూమి బీజేపీకి మాత్రమే సొంతం కాదని ప్రజలు తీర్పునిచ్చారని అన్నారు. మోడీ వారణాసిలో బతికి బయటపడ్డారని అన్నారు. హిందూ సమాజం అంటే బీజేపీ, ఆర్‌ఎస్సెస్‌ మాత్రమే కాదని అన్నారు. హిందూ సమాజం అంటే ఒక్క మోడీనే కాదని, సభలో ఉన్నవారు, బయట ఉన్నవారంతా హిందువులే అని అన్నారు. కాగా.. రాహుల్‌గాంధీ వ్యాఖ్యలకు బీజేపీ సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది. తన మైక్‌ను ఎందుకు కట్‌ చేస్తున్నారని రాహుల్‌ ప్రశ్నించారు. రాహుల్‌ వ్యాఖ్యలపై ప్రధాని మోదీ , అమిత్‌షా మండిపడ్డారు. దేశ ప్రజలను ఎమ్జ్గంªన్సీ పేరుతో జైల్లో పెట్టిన చరిత్ర కాంగ్రెస్‌ పార్టీదన్నారు అమిత్‌షా. సిక్కుల ఊచకోతను మర్చిపోయారా అని రాహుల్‌ను ప్రశ్నించారు. రాహుల్‌ తన వ్యాఖ్యలకు దేశ ప్రజలకు , హిందువులకు క్షమాపణ చెప్పాలన్నారు.రాహుల్‌ వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు అభ్యంతరం తెలిపారు.. రాహుల్‌ సభ్యత్వాన్ని రద్దు చేయాలని బీజేపీ ఎంపీ దూబే స్పీకర్‌ ను కోరారు.

 

రాహుల్‌ హిందువులను కించపర్చలేదు
` లోక్‌సభలో ప్రసంగాన్ని సమర్థించిన ప్రియాంక
న్యూఢల్లీి(జనంసాక్షి): రాహుల్‌ గాంధీ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆయన క్షమాపణ చెప్పాలని బీజేపీ ఎంపీలు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీకి ఆయన సోదరి ప్రియాంక గాంధీ మద్దతుగా నిలిచారు. తన సోదరుడు ఎప్పుడూ హిందువులను కించపరచడుని, రాహుల్‌ కేవలం బీజేపీ, ఆ పార్టీ నేతల గురించి మాత్రమే మాట్లాడారంటూ ప్రియాంక మద్దతుగా నిలిచారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా తన మొదటి ప్రసంగంలో కేంద్రంలోని ఎన్‌డిఎ సర్కార్‌ పై తీవ్రస్థాయిలో రాహుల్‌ గాంధీ ఫైరయ్యారు. అయితే రాహుల్‌ తన ప్రసంగంలో హిందువులని చెప్పుకునే బీజేపీ నేతలు హింసను ప్రేరేపిస్తుందని, హిందుత్వం పేరుతో దేశ ప్రజలను బీజేపీ భయపెడుతుందంటూ ఆయన చేసిన కామెంట్స్‌ దూమారం రేపాయి. అయితే రాహుల్‌ చేసిన కామెంట్స్‌ పై ప్రధాని మోదీ సీరియస్‌ అయ్యారు. హిందు సమాజాన్ని మొత్తం హింసావాదులతో పొల్చడం సీరియస్‌ మ్యాటర్‌ అని అన్నారు. దీనికి మోదీ, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ కలిస్తే మొత్తం హిందు సమాజం అవ్వదు అని రాహుల్‌ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో లోక్‌ సభ రసాభసాగా మారింది.

రాహుల్‌ ప్రసంగంపై ప్రధాని మోదీ అభ్యంతరం
దిల్లీ(జనంసాక్షి):దేశమంతా ఏకమై రాజ్యాంగ పరిరక్షణకు కృషి చేసిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌ గాంధీ పేర్కొన్నారు. భారత్‌ అనే భావన, రాజ్యాంగంతోపాటు భాజపా ఆలోచనలను ప్రతిఘటించిన లక్షలాదిమందిపై గత పదేళ్లలో క్రమపద్ధతిలో దాడి జరిగిందని ఆరోపించారు.తానూ బాధితుడినేనని.. తనపై 20కిపైగా కేసులు మోపారన్నారు. ‘’నాకు రెండేళ్ల జైలుశిక్ష పడిరది. నా ఇల్లు తీసేసుకున్నారు. ఈడీ ఆధ్వర్యంలో 55 గంటల పాటు విచారణ ఎదుర్కొన్నా’’ అని రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్పే తీర్మానంపై చర్చలో భాగంగా రాహుల్‌ ప్రసంగించారు. ప్రతిపక్షంలో ఉండటం గర్వంగా, సంతోషంగా ఉందని పేర్కొంటూ.. అధికారంలో కంటే ఇదే ఎక్కువ విలువైనదని, ఇందులో ‘సత్యం’ ఉందని తెలిపారు. అయితే కాంగ్రెస్‌ ఎంపీ మాట్లాడుతుండగా ప్రధాని సహా భాజపా ఎంపీలు పదే పదే అభ్యంతరం తెలపడం గమనార్హం.ఈ సందర్భంగా ఆర్‌ఎస్‌ఎస్‌, భాజపాపై విమర్శలు గుప్పించిన రాహుల్‌ గాంధీ.. సభలో కొన్ని మతపరమైన ఫొటోలను చూపించారు. దీనిపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. సభలో ఇలాంటి మతపరమైన ఫొటోల ప్రదర్శనకు నిబంధనలు అంగీకరించవని స్పీకర్‌ ఓం బిర్లా వారించారు. ఈ క్రమంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలగజేసుకుని రాహుల్‌ వ్యాఖ్యలపై అభ్యంతరం తెలిపారు. హిందువులను హింసావాదులుగా రాహుల్‌ పేర్కొనడం ఆమోదనీయం కాదని దుయ్యబట్టారు. అటు కేంద్ర మంత్రి అమిత్‌ షా సైతం విపక్ష నేత క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్‌ చేశారు. ఎమర్జెన్సీ, 1984 సిక్కు వ్యతిరేక అల్లర్లకు కారకులైన వారికి.. అహింస గురించి మాట్లాడే హక్కు లేదన్నారు. అయితే.. తాను భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశానని.. ఆ పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌లే మొత్తం హిందూ సమాజం కాదని రాహుల్‌ తెలిపారు. అన్ని మతాలు ధైర్యం, నిర్భయత, అహింస సందేశాలను చాటి చెబుతున్నాయన్నారు.’’రాష్ట్రపతి ప్రసంగంలో నీట్‌, అగ్నివీర్‌ల ప్రస్తావన లేదు. ప్రొఫెషనల్‌ పరీక్ష అయిన ‘నీట్‌’ను కమర్షియల్‌గా మార్చారు. గతంలో తీసుకొచ్చిన రైతు చట్టాల వల్ల 700 మంది అన్నదాతలు ప్రాణాలు కోల్పోయారు. వారికి సంతాపంగా సభలో మౌనం కూడా పాటించలేదు. భాజపా హయాంలో సంస్థలు నిర్వీర్యమయ్యాయి. దేవుడితో ప్రత్యక్షంగా మాట్లాడతానని స్వయంగా ప్రధాని చెప్పారు. భాజపా ప్రభుత్వం.. జమ్మూకశ్మీర్‌ను రెండు ముక్కలు చేసింది. అల్లర్లతో మణిపుర్‌ అట్టుడికిపోయినా.. ఇప్పటివరకు ప్రధాని వెళ్లలేదు. అక్కడ నా కళ్లముందే పిల్లలపై బుల్లెట్ల వర్షం కురిసింది. నోట్ల రద్దు వల్ల యువత ఉపాధి కోల్పోయింది. జీఎస్టీ వల్ల వ్యాపారులు, ప్రజలు అనేక బాధలు పడ్డారు. వీటి వల్ల దేశప్రజలకు కలిగిన లాభం ఏంటి?’’ అని ప్రశ్నించారు.