దిలావర్‌పూర్‌లో SIR ఓటరు నమోదుపై సమీక్ష

*2 రోజుల్లో 100% పూర్తి చేయాలని శ్రీహరి రావు ఆదేశం*

దిలావర్‌పూర్, జూలై 17, (జనం సాక్షి) : మండల కేంద్రంలో శుక్రవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ కూచాడి శ్రీహరి రావు ఆధ్వర్యంలో SIR ఓటరు నమోదు ప్రక్రియపై బీఎల్ఓలతో సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా శ్రీహరి రావు మాట్లాడుతూ, రానున్న రెండు, మూడు రోజుల్లో మండలంలో 100% ఓటర్ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని బీఎల్ఓలకు సూచించారు. ఓటర్ల జాబితాలో పేర్లు వదిలిపెట్టకుండా, ఇంటింటికి వెళ్లి క్షేత్రస్థాయిలో వివరాలు సేకరించాలని ఆదేశించారు. 2002లో ఓటు హక్కు లేని వారి వివరాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తెలిపారు.ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా పారదర్శకంగా పూర్తి చేయాలని, ఎవరికైనా సందేహాలు ఉంటే వెంటనే అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దిలావర్‌పూర్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కొమ్ము దేవేందర్ రెడ్డి, దిలావర్‌పూర్ సర్పంచ్ పాల్దె అక్షర అనిల్, ఉపసర్పంచ్ నడుకుడ సుఖేష్ , మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు