దిలావర్‌పూర్‌లో అధికారుల స్పెషల్ డ్రైవ్ – పాఠశాలలు, జీపీలలో సార్(SIR) పై ఫోకస్


దిలావర్‌పూర్, జూలై 17, (జనం సాక్షి) :మండలంలోని పలు గ్రామాల్లో శుక్రవారం మండల ప్రత్యేకాధికారి (డీఆర్వో) రమేష్ రాథోడ్, మండల పరిషత్ అధికారి గోవర్ధన్ సంయుక్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించారు.మాయాపూర్ జీపీ రికార్డుల క్షుణ్ణ పరిశీలన,ఉదయం ఎంపీఓ గోవర్ధన్ మాయాపూర్ గ్రామ పంచాయతీని సందర్శించి జీపీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వైకుంఠధామం, సెగ్రిగేషన్ షెడ్, నర్సరీలను తనిఖీ చేశారు. స్థానిక ప్రాథమిక పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను సందర్శించి విద్యార్థుల హాజరు, అందుతున్న సేవలపై ఆరా తీశారు.గుండంపల్లి జెడ్పీహెచ్ఎస్‌లో ఆకస్మిక తనిఖీ,మధ్యాహ్నం డీఆర్వో రమేష్ రాథోడ్, ఎంపీఓ గోవర్ధన్‌తో కలిసి గుండంపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్శనలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మధుకర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.అధికారులు తరగతి గదులు, కంప్యూటర్ ల్యాబ్, మధ్యాహ్న భోజన పథకం, కిచెన్ గార్డెన్, ఆర్.ఓ ప్లాంట్(తాగునీటి సౌకర్యం), మరుగుదొడ్లను నిశితంగా పరిశీలించారు. పాఠశాల ప్రాంగణాన్ని పరిశుభ్రంగా ఉంచాలని, విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఉపాధ్యాయులు, సిబ్బందికి కీలక సూచనలు చేశారు.దిలావర్‌పూర్‌లో SIR ప్రక్రియపై సమీక్ష,మండల కేంద్రంలోని అంగన్‌వాడీ కేంద్రంలో SIR ప్రక్రియపై బీఎల్ఓలతో డీఆర్వో రమేష్ రాథోడ్ మాట్లాడారు. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. 2002లో ఓటు హక్కు లేని వారి వివరాలపై బీఎల్ఓలు అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ రమేష్ తో ఎంపీ ఓ గోవర్ధన్ , పంచాయతీ కార్యదర్శి మహేందర్, గ్రామ నాయకులు పల్దె అనిల్, బి ఎల్ ఓ లు పాల్గొన్నారు.



