జగదాంబ తండా పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగుల పంపిణీ

ఎస్‌ఎంసీ కమిటీ ఎన్నిక:సిరికొండ , జూలై 18:(జనం సాక్షి )జగదాంబ తండా ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ విద్యా సామగ్రికి ఏఈ తిరుపతి ఆర్థిక సహాయం అందించారు. గ్రామ సర్పంచ్ మాలవత్ సుగుణ చేతుల మీదుగా విద్యార్థులకు నోట్‌బుక్స్, బ్యాగులను అందజేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ మాలవత్ సుగుణ మాట్లాడుతూ, గ్రామంలోని ప్రతి విద్యార్థి నాణ్యమైన విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. పాఠశాల అభివృద్ధికి గ్రామపంచాయతీ ఎల్లప్పుడూ సహకరిస్తుందని తెలిపారు.అనంతరం పాఠశాల స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ (SMC) ఎన్నిక నిర్వహించగా, కమిటీ సభ్యులుగా రమేష్, హేమ, వినోద్ తదితరులు ఎన్నికయ్యారు.ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకుడు రవి నాయక్, పాఠశాల ప్రిన్సిపాల్ విజయలక్ష్మి, పంచాయతీ సెక్రటరీ పాషా, ఉప సర్పంచ్ గణేష్, వార్డు సభ్యులు నితిన్, మంజుల, మహిపాల్, గంగాధర్, వెంకటేష్, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు మరియు పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.



