నూతన గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్

గంభీరావుపేట జూలై 17(జనం సాక్షి);రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని పొన్నాలపల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామపంచాయతీ భవనాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన భవనంలో ఏర్పాటు చేసిన సౌకర్యాలను పరిశీలించి, గ్రామ సర్పంచ్ పొన్నాల మహేష్ కు శుభాకాంక్షలు తెలిపి కాలువతో సన్మానించారు గ్రామ ప్రజలకు మెరుగైన పరిపాలన అందించే విధంగా గ్రామపంచాయతీ వ్యవస్థ పనిచేయాలని ఆకాంక్షించారు.అనంతరం గ్రామ అభివృద్ధికి సంబంధించిన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, ధార్మిక క్షేత్ర జిల్లా అధ్యక్షులు డాక్టర్ సత్యనారాయణ, జిల్లా అధికార ప్రతినిధి దేవస్థానం కృష్ణ, మైనార్టీ నాయకులు వాజిద్ హుస్సేన్, మండల అధ్యక్షులు కోడె రమేష్, మాజీ అధ్యక్షులు గంట అశోక్, మల్లేష్ యాదవ్ కక్కు దేవేందర్, ప్రసాద్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నాయకపు నరేష్, పొన్నాలపల్లి వార్డ్ మెంబర్లు, ప్రజాప్రతినిధులు, అధికారులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తాజావార్తలు