గుర్తుతెలియని వ్యక్తి చేతిలో వృద్ధుడి హత్య

రెబ్బెన,జూలై17(జనం సాక్షి): రెబ్బెన మండల కేంద్రంలోని ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ సమీపంలో శుక్రవారం ఉదయం పర్స నంబల కు చెందిన మసాడే సోమయ్య 65 అనే వృద్ధుడు హత్యకు గురయ్యాడు. మృతుడి భార్య కరుణా బాయ్ అందించిన ఫిర్యాదు ఆధారంగా వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడికి భార్య లక్ష్మి సుజాత అనే ఇద్దరు కూతుర్ల తో పాటు ఒక కుమారుడు ఉన్నాడు. పెద్ద కూతురు అయిన లక్ష్మి గత కొంతకాలంగా హైదరాబాదులో కూలీ పనులు చేసుకుంటూ అక్కడ జీవిస్తోంది. గురువారం నంబాలలో ఉంటున్న చిన్న కూతురు సుజాత ఇంటికి లక్ష్మి రావడంతో తనని చూసేందుకు పర్స నంబాల నుండి సోమయ్య తో పాటు ఆయన భార్య నంబాల కి వెళ్ళారు… ఆ రోజంతా అందరూ కలిసి చిన్న కూతురు ఇంట్లో ఉండే శుక్రవారం ఉదయం పెద్ద కూతురు లక్ష్మి తిరిగి హైదరాబాద్ వెళుతుండడంతో ఆమెను రైలు ఎక్కించేందుకు సోమయ్య, అతని భార్య, చిన్న కూతురైన సుజాతలు ఆసిఫాబాద్ రోడ్డు రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అయితే సోమయ్య అతని భార్య, ఇద్దరు కూతుళ్లు స్టేషన్ లో ఉండగా చాయ్ తాగి వస్తానని వారికి చెప్పి రెబ్బెన బస్టాండ్ వైపు వెళ్ళాడు. చాయ్ తాగి తిరిగి వస్తున్న క్రమంలో గుర్తుతెలియని వ్యక్తి గొడ్డలితో మెడపై బలంగా మోదడం తో తల మొండెం వేరు అయి సోమయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యాడు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి నిందితుడి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టడమైనది. సంఘటన స్థలాన్ని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ రెబ్బెన సీఐ సంజయ్, రెబ్బెన ఎస్సై వెంకట కృష్ణ పరిశీలించి హత్య జరిగిన తీరును ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుసుకున్నారు. నిందితుడి ఆచూకీ కనుక్కునేందుకు రైల్వే స్టేషన్ , ఇతర ప్రాంతాల్లో ఉన్న సిసి టీవీ ఫుటేజ్ లను పరిశీలించారు. క్లూస్ టీం, డాగ్స్ స్కాడ్ సిబ్బంది సంఘటన స్థలంలో వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించటమైనది.

తాజావార్తలు