విద్యుత్ షాక్ తో మృతి చెందిన మహిళ కుటుంబానికి రూ.7 వేల ఆర్థిక సహాయం…

 

 

 

 

 

 

చెన్నారావుపేట, జనవరి 3 (జనం సాక్షి):

దాతలుగా ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు, గ్రామ ఏఎన్ఎం….

నిరుపేద కుటుంబానికి అండగా నిలుస్తున్న దాతలు, దయార్ధ హృదయులు…

 

విద్యుత్ షాక్ తో మృతి చెందిన లింగాపురం గ్రామానికి చెందిన పల్లాటి సబిత కుటుంబానికి లింగాపురం గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు రూ.5 వేలు, గ్రామ ఏఎన్ఎం శ్వేత రూ.2 వేల ఆర్థిక సహాయాన్ని శనివారం అందించారు. విద్యుత్ షాక్ తో సబిత గత కొద్ది రోజుల క్రితం మృతి చెందడంతో ఆమె ఇద్దరు కుమార్తెలు దేవిక, సహస్రలు పెద్ద దిక్కును కోల్పోయారు. గ్రామ మాజీ సర్పంచ్ తప్పెట రమేష్ “జనం సాక్షి” దిన పత్రికలో డిసెంబర్ 27వ తేదీన విద్యుత్ ఘాతంతో తల్లి మృతి.. పెద్ద దిక్కును కోల్పోయిన చిన్నారులు…అని వచ్చిన కథనాన్ని వాట్సాప్ గ్రూపుల్లో, సోషల్ మీడియాలో తల్లిని కోల్పోయిన చిన్నారులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని పోస్టులు పెట్టి వేడుకున్నారు. అంతేకాక జనం సాక్షిలో వచ్చిన కథనం పలువురి దాతలను కదిలిస్తుంది. ఆమె కుటుంబానికి గ్రామస్తులు, దయార్ధ హృదయులు, దాతలు ఆర్థిక సహాయం చేయడానికి ఒక్కొక్కరుగా ముందుకు వస్తున్నారు. కొందరు ఫోన్ పే, గూగుల్ పే 9000593955, 9959348888 నెంబర్లకు తమకు తోచినంత ఆర్థిక సహాయాన్ని అందజేస్తున్నారు. అదేవిధంగా గ్రామంలోని ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు రూ.5 వేలు, స్థానిక ఏఎన్ఎం రూ.2 వేలు నిరుపేద కుటుంబానికి మొత్తం రూ.7 వేల ఆర్థిక సహాయాన్ని అందించి ఆ కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా ముందుకు వచ్చిన ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు, ఏఎన్ఎం లకు కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే దాతలు, దయార్థ హృదయులు తమ పెద్ద మనసు చేసుకొని నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం అందించి తోడుగా నిలవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్స్ యూనియన్ నాయకులు తాళ్లపల్లి స్వామి, రామగిరి యాకయ్య, ఓరుగంటి కుమార్, నామోజు కేదారి, తాళ్లపళ్లి రఘు, పొట్టేటి పాని, వరంగంటి రాజు, బొక్కల అనిల్, ఎలగోయ కరుణాకర్, రవి, మైదం రాము, ఏఎన్ఎం శ్వేత, తదితరులు పాల్గొన్నారు.