నేడు ఉచిత మెడికల్ క్యాంపును వినియోగించుకోవాలి

బచ్చన్నపేట (జనంసాక్షి) : నేడు బచ్చన్నపేట మండల కేంద్రంలో మల్లారెడ్డి నారాయణ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి ఉచిత మెడికల్ క్యాంపు ను నిర్వహిస్తున్నందున ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని మాజీ సర్పంచ్ నల్లగొని పుష్ప బాల్ కిషన్ గౌడ్ అన్నారు. ఈ క్యాంపు ఉదయం 9:30 నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు ఉంటుందన్నారు. డిఏఓ రామారావు నాయక్ స్పెషల్ ఆఫీసర్.ఎంపిడిఓ మల్లికార్జున్. పంచాయతీ కార్యదర్శి నరసింహ చారి. ఆధ్వర్యంలో జరుగుతుందని మాజీ శర్మని తెలిపారు.ఈ క్యాంపులో ఉచిత బీపీ, షుగర్, పరీక్షలు చేసి ఉచితంగానే చేస్తారని తరవాత వారికి సంబంధించిన మోకాళ్ళనొప్పులకు, నడుము నొప్పులు,దగ్గు, దమ్ము, జ్వరం, నడుము నొప్పి,ఆయాసం,తలనొప్పి,ఆకలి లేకపోవడం,సర్ది, దురద,బలానికిమందులు,చిన్నపిల్లలకి మరియు రక్తం తక్కువగా ఉన్న వారికి మందులు ఇంకా వగైరా వగైరా మందులు కూడా ఉచితంగా ఇస్తారు.ఇంకా ఎవరికైనా ఏమైనారక్త పరీక్షలు, ఎక్స్రేలు, స్కానింగ్ బలానికిమందుల, సిటీ. మెదడు మరియు మోకాళ్ళకు, నడుముకి ఎన్ఆర్ఐ స్కానింగ్ , ఆపరేషన్ లు ఉన్న కూడా వారిని ఎంపిక చేసి ఆసుపత్రికి తీసుకెళ్ళి ఉచితంగానే చేస్తారని డాక్టర్ల క్యాంప్ బృందం డాక్టర్ తెలిపారని .ఈ అవకాశాన్ని మండల ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.