తెలంగాణ జాగృతి కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భావ పోస్టర్ ఆవిష్కరణ

గంభీరావుపేట ఏప్రిల్ 18 (జనం సాక్షి):ఈనెల ఏప్రిల్ 25వ తేదీనాడు మేడ్చల్ జిల్లాలోని మునీరాబాద్ లోని అద్వయ కన్వెన్షన్ లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్తగా ఏర్పాటు చేసే రాజకీయ పార్టీ ఆవిర్భావం సందర్భంగా తెలంగాణ జాగృతి జిల్లా ఉపాధ్యక్షులు వర్ధ సతీష్ నాయకులు జాగృతి నాయకులు కూరసురేష్ పటేల్, ముఖ్యఅతిథిగా హాజరై పోస్టర్ల ఆవిష్కరణ చేశారు,శనివారం రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద,తెలంగాణ , జాగృతి నాయకులు కూర సురేష్ పటేల్ ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేపట్టారు,
ఈ సందర్భంగా సురేష్ మాట్లాడుతూ సామాజిక తెలంగాణ ధ్యేయంగా మహిళలు విద్యార్థులుయువకులకు పెద్దపీట వేస్తూ నీళ్లు నిధులు నియామకాలు గత ప్రభుత్వంలోమనకు సంపూర్ణంగా అందలేదు కాబట్టిప్రశ్నించు ,పోరాడు పరిష్కరించుఅనే నినాదంతో పోరాటం చేసే దిశగా కవితక్క కొత్త పార్టీ ఏర్పాటు చేస్తున్న సందర్భంగా పార్టీ పెట్టకముందే పెద్ద ఎత్తున బిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్ ,పార్టీ నుండి పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితక్క ఆధ్వర్యంలో కండువా కప్పుకుని జాగృతిలో చేరడం జరుగుతుంది కాబట్టి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల నుంచి గ్రామాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు యువకులు రైతులు విద్యార్థులు ఈ యొక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభకు తరలిరావాలని పిలుపునివ్వడం జరిగింది అదేవిధంగా జిల్లా ఉపాధ్యక్షులు వర్ధ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ జాగృతి సంస్థ స్థాపించినప్పటి నుండి గత 20 సంవత్సరాలుగా తెలంగాణ ఉద్యమంలో కవితక్క జాగృతి సంస్థ ద్వారా అనేక ఉద్యమాలు పోరాటాలు సేవా కార్యక్రమాలు చేసి తెలంగాణ మలిదశ ఉద్యమంలో తనదైన ముద్ర వేసుకొని రాష్ట్ర ఆవిర్భావంలో తన పాత్ర చాలా గొప్పది ఇది తెలంగాణ ప్రజానీకానికి తెలుసు కానీ గత పాలకులు తెలంగాణను నిర్లక్ష్యం చేసి నీళ్లు నిధులు నియామకాలు సక్రమంగా అమలు చేయక కవితక్క మరో ఉద్యమాన్ని చేపట్టే దిశగా ఈరోజు సామాజిక తెలంగాణ ఏర్పాటు దిశగా రాష్ట్రంలో ఇంటి పార్టీని ఏర్పాటు చేసే దిశగా అడుగులు వేసిన క్రమంలో తెలంగాణ లోని సబ్బండ వర్గాల ప్రజల ఆశీర్వాదం ఉండాలని ఏప్రిల్ 25 నాడు కొత్తగా ఏర్పాటు చేసేటటువంటి రాజకీయ పార్టీ ఆవిర్భావ కార్యక్రమానికి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని అన్ని మండలాల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలివచ్చి ఈ యొక్క కొత్త పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలని కోరారు, ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు, వర్ధ సతీష్, జాగృతి నాయకులు కూరసురేష్ పటేల్,ఎల్లారెడ్డిపేటమండల ఇన్చార్జి, కదిరే భాస్కర్ గౌడ్, ముస్తాబాద్ ఇంచార్జ్, ఎడ్ల రమేష్, మండల నాయకులు, ఓరుసు అశోక్, ఎర్ర నరసయ్య,, రంగారావు, నాయకపు స్వామి, తదితరులు పాల్గొన్నారు