దేశంకోసం ధర్మకోసం పనిచేసే పార్టీ బీజేపీ

మల్దకల్ జూలై 17 (జనంసాక్షి)మండల కేంద్రంలోని బిజెపి మండల కార్యవర్గ సమావేశం శుక్రవారం మండల బిజెపి అధ్యక్షులు తిరుపతిరెడ్డి అధ్యక్షతనజరిగింది.సమావేశానికి ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులుఎస్ రామచంద్రారెడ్డి హాజరై మాట్లాడుతూ
దేశంలో నరేంద్ర మోడీజీ ముచ్చటగా మూడోసారి సుపరిపాలన అందిస్తున్నారు.
బీజేపీ పార్టీ ప్రతికార్యకర్త,నాయకులు ప్రజా ప్రతినిధులు దేశం కోసంధర్మం కోసం పనిచేస్తున్నారు.గ్రామ,పట్టణ అభివృద్ధిలో ప్రతి పథకం కేంద్ర ప్రభుత్వ పథకమే ప్రతినెల 6 కేజీల సన్న బియ్యం,సిసి రోడ్లు అంగన్వాడీ సెంటర్లలో చిన్నారులకు గర్భిణీలకు పౌష్టికాహారం దేశభద్రత దేశ రక్షణ ప్రతి పౌరునికి కావాల్సిన ప్రతి నిత్యవసర సరుకులు పథకాలు రైతులకుఎరువులు,విద్యకు సంబంధించిన పథకాలు ఏ జబ్బు చేసిన అందరికీ అందుబాటులో వైద్య సదుపాయం మధ్యాహ్న భోజనందేశం ఉన్న 140 కోట్ల మంది ప్రజలకు కరోనా ఏ దేశానికి సాధ్యం కానీ వ్యాక్సిన్ భారతదేశంలో దేశ ప్రధాని నరేంద్ర మోడీ చొరవ వలన మన దేశంలోనే తయారు కోవిడ్ వ్యాక్సిన్ చేసి 100 కు పైగ ప్రపంచ దేశాలకు సరఫరా చేసిన ఘనత భారతదేశానిది రైతులకు సబ్సిడీ రూపంలో యూరియా,డిఏపి కంప్లెక్స్ పలు రకాల ఎరువులనుఅతి తక్కువ ధరకు అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మహిళలకు యువతకు,కర్షకుల అనేక సంక్షేమ పథకాలను అందిస్తుందన్నారు.ఈ కార్యక్రమంలోజిల్లా ఉప అధ్యక్షలు వెంకటేశ్వరరెడ్డి,కార్యదర్శి దామనాగరాజు,జిల్లా కౌన్సిల్ సభ్యలు రెడ్డప్ప,నాయకులు సాయినాథ్ రెడ్డి,నర్సిములు,వాసిరెడ్డి,తిమన్న,ప్రసాద్,తిరుమల్,ఈరన్నగౌడ్,తిమ్మప్ప, చంద్రశేఖర్,అశోక్,బలరాం,ఉప్పల వెంకటేష్,లక్ష్మణ్ గౌడ్,అంజి,భీమన్న తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు