పేదల అభ్యున్నతికై కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నది
తిరుమలగిరి (సాగర్) (జనంసాక్షి): పేదల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడు పాటుపడి ఉంటుందని, నాగార్జునసాగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు కుందూరు జైవీర్ రెడ్డి అన్నారు . గురువారం మండలంలోని పైలట్ గ్రామంగా ఎన్నికైన నాయకుని తండాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమని వారి అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు . విద్యుత్ కొరత లేకుండా ఉండేందుకు నాయకుని తండాలో విద్యుత్తు సబ్ స్టేషన్ ను ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు వరి ధాన్యాన్ని అమ్ముకోవటం కోసం ఇబ్బంది పడుతున్నందున ఈ ప్రాంతంలో ఐకెపి సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు. రెవిన్యూ పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గిరిజనులు సాగు చేసుకుంటున్న భూములకు త్వరలోనే పట్టాలు అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట పిడి రాజశేఖర్, ఎంపీడీవో మల్లీశ్వర్, తహసిల్దార్ అనిల్ కుమార్ , జెడ్పి జిల్లా వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి , హాలియా మార్కెట్ కమిటీ చైర్మన్ తుమ్మలపల్లి చంద్రశేఖర్ రెడ్డి , వైస్ చైర్మన్ కలసాని చంద్రశేఖర్ , జిల్లా కాంగ్రెస్ నాయకుడు గడ్డం సాగర్ రెడ్డి , మాజీ ఎంపీపీ ఆంగోతు భగవాన్ నాయక్, జటావత్ లాలు నాయక్, మేరావత్ ముని నాయక్ , బీకు నాయక్, బిచ్చాలు, శౌరి ,జబ్బర్, పాండు తదితరులున్నారు.