రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
మంథని, (జనంసాక్షి) : రైతును రాజు చేయడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలంలోని జూలపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల ఆదర్శనగర్ లో ఆదివారం కమాన్ పూర్ పిఎసిఎస్, సింగిల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో ₹ 40 వేల కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కోసం ఖర్చు పెట్టడం జరిగిందన్నారు. రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. వరి దాన్యం విక్రయించే రైతులందరికి కనీస మద్దతు ధరతో వరి దాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. రైతుల సంకమం, అభ్యున్నతే ద్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం తగు ప్రణాళికతో ముందుకు సాగుతుందన్నారు. సింగిల్ విండో సీఈవో తిమ్మరాజు సంతోష్ కుమార్, మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.