రైతుల ముఖాల్లో చిరునవ్వు చూడడమే ప్రభుత్వ ద్వేయం

మహబూబాబాద్ ప్రతినిధి (జనంసాక్షి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ గారు మహబూబాబాద్ నియోజకవర్గం నెల్లికుదురు మండలంలోని శ్రీరామగిరి ఎర్రబెల్లి గూడెం మేచారాజుపల్లె గ్రామాల్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను స్థానిక మండల నాయకులతో కలిసి ప్రారంభించిన మహబూబాబాద్ ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళి నాయక్ మాట్లాడుతూ ఆరుగాలం కష్టపడి, చెమటోడ్చి పండించిన రైతుల కష్టార్జితాన్ని గత ప్రభుత్వంలోని పాలకులు కటింగ్ ల పేరుతో అనేక విధాలుగా అవినీతికి అక్రమాలకు పాల్పడినరని వారు అన్నారు తాము పూర్తి పారదర్శకంగా రైతులకు న్యాయం చేకూర్చేందుకు పనిచేస్తున్నామని అన్నారు. అధికారంలో లేనప్పుడు వడ్ల కటింగ్ లకు వ్యతిరేకంగా పోరాటం చేశామని ఎమ్మెల్యేగా గెలుపొందిన తర్వాత ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగానే ఎక్కడ కటింగ్లు లేకుండా వడ్ల కొనుగోలు చేస్తున్నామని అన్నారు. కొనుగోలు కేంద్రాలలోకి ధాన్యం తీసుకువచ్చి తమ తమ సీరియల్ నంబర్ పొంది రైతులు దిమగా ఉండవచ్చని రైతు పంట తూకం చేసిన 48 గంటల్లోనే రైతు ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయని. ఈసారి కూడా సన్న వడ్లకు బోనస్ అందిస్తామని అకాల వర్షాల వల్ల దురదృష్టవశాత్తు పంటలకు నష్టం జరిగితే రైతులకు అదైర్య పడవద్దని దెబ్బతిన్న వడ్లను కూడా కొనుగోలు చేసే విధంగా కృషి చేస్తామని త్వరలోనే అన్ని గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ళను మంజూరు చేయిస్తామని వారు అన్నారు . ప్రతి క్వింటాలకు రైతులకు పారదర్శకంగా చెల్లింపులు జరగేలా అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారుల నుండి నివేదికలు పొందాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి అంకితంగా పనిచేస్తోంది. ఒక్కొక్క పంటకు తగిన మద్దతు ధర కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడంలో పాక్షిక విజయాన్ని సాధించామని గర్వంగా చెబుతున్నాం .ఈ కేంద్రం ద్వారా ఆదాయ మార్గాలు మెరుగవుతాయి అన్నారు . ఈ కార్యక్రమంలో మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు గ్రామ నాయకులు డైరెక్టర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు