భారత రాజ్యాంగం రక్షించాలి రిజర్వేషన్ అన్ని కులాలకు వర్తించాలి : ఎమ్మెల్యే నర్సారెడ్డి

తూప్రాన్ (జనంసాక్షి): భారత రాజ్యాంగం రక్షించాలి అన్ని కులాలకు రిజర్వేషన్ వర్తించాలని నినాదంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమాన్ని గ్రామ గ్రామా నిర్వహించి అంబేద్కర్ జయంతి రోజున కార్యక్రమం ముగిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే తూముకుంట నర్సారెడ్డి తెలిపారు. అంబేద్కర్ 134 జయంతి సందర్భంగా మనోహర్ బాద్ మండలంలోని లింగారెడ్డి పేట గ్రామంలో కాంగ్రెస్ నాయకులు పెంట గౌడ్ ఆధ్వర్యంలో గ్రామంలో రాజ్యాంగం రక్షించాలి రిజర్వేషన్లు అందరికీ వర్తించాలని నిర్ణయంతో అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలని నినాదాలతో గ్రామంలో ర్యాలీ నిర్వహించి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి జై భీమ్ జండా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహాత్మా గాంధీ దేశానికి స్వాతంత్రం తీసుకువచ్చారని అంబేద్కర్ అన్ని వర్గాలకు రిజర్వేషన్లు వర్తించాలని ఉద్దేశంతో రాజ్యాంగాన్ని రచించారని అన్నారు. రిజర్వేషన్లు 50% నుంచి ఉండదన్న నినాదాన్ని రాహుల్ గాంధీ వ్యతిరేకించారని జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు .ఈ కార్యక్రమంలో మాజీ ఎంపిటిసి రేకుల కృష్ణ గౌడ్, మల్లేష్, కృష్ణ ,శ్రీనివాస్, రవీందర్, తొగర్ శంకర్ గ్రామ పార్టీ అధ్యక్షులు తొగరి యాదగిరి ,అబ్బ దాసరి బాలేశు ,ఓంప్రకాష్ బాబు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం గ్రామస్తుల సమక్షంలో రాజ్యాంగాన్ని రక్షిస్తామంటూ ప్రతిజ్ఞ చేయించారు.