గ్రామాలలో గులాబీ జెండా ఎగురాలే

 

 

 

 

 

 

పరకాల, డిసెంబర్ 5 (జనం సాక్షి):

కార్యకర్తలకు దిశానిర్దేశం చేసిన మాజీ ఎమ్మెల్యే చల్లా.

పంచాయితీ ఎన్నికల్లో గ్రామగ్రామాన గులాబీ జెండా ఎగురాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.శుక్రవారం పంచాయతీ ఎన్నికల్లో భాగంగా పరకాల మండలం నాగారం గ్రామంలో ఏర్పాటుచేసిన మండల స్థాయి సన్నాహక సమావేశం మాజీ ఎమ్మెల్యే పాల్గొన్నారు.ఈ సందర్భంగా కార్యకర్తలనుద్దేశించి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూకార్యకర్తలంతా సమన్వయంతో బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరు ఒక సైనికుడిలా పనిచేయాలనీ,బీఆర్‌ఎస్‌ పార్టీ బలపర్చిన అభ్యర్థులు గెలిస్తేనే రెండేళ్లుగా ఆగిపోయిన అభివృద్ధి మళ్లీ పరుగులు పెడుతుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలను,420 బోగస్ హామీలను ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలకు తెలియచేసి,బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాల్లో చేసిన అభివృద్ధికి ప్రజలకు గుర్తుచేయాలనీ అన్నారు.గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ పనిచేశారన్నారు.గడిచిన రెండేళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని అన్నారు.కాంగ్రెస్‌ బీసీలను మోసం చేసిందని, ఆ పార్టీకి వారు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వం మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా నిర్వీర్యం చేసిందని, గ్రామాల్లో సెక్రటరీలు సైతం తప్పించుకొని తిరిగే పరిస్థితి నెలకొందన్నారు.ప్రభుత్వం గ్రామ పంచాయతీలతోపాటు విద్య, వైద్యం, రోడ్లు దెబ్బతిన్నా పట్టించుకోవడం లేదన్నారు.రైతులకు బోనస్‌, మద్దతు ధర ఇవ్వకపోగా, కనీసం వడ్లు కొనే దిక్కులేదన్నారు. పింఛన్లు పెం చుతామని, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తామని ఇవ్వలేదన్నారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇవ్వలేదని, యువతకు ఉద్యోగాలు లేవని.. ఇలా ప్రతి రంగా న్నీ నిర్వీర్యం చేసిందన్నారు.పదేండ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో కేసీఆర్‌ నాయకత్వంలో గ్రామాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయన్నారు. కేసీఆర్‌ చేసిన అభివృద్ధే గ్రామాల్లో బీఆర్‌ఎస్‌ బలపర్చిన అభ్యర్థులను సర్పంచ్‌లుగా, వార్డు మెంబర్లుగా గెలిపిస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు,మాజీ వైస్ ఎంపీపీ చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి,సమన్వయ కమిటీ సభ్యులు చింతిరెడ్డి సాంబరెడ్డి,గురిజపల్లి ప్రకాష్ రావు, మునిగాల సురేందర్ రావు,గంట సమ్మిరెడ్డి,ఆముదాలపల్లి అశోక్, కోరే రమేష్,నడికుడ మండల సీనియర్ నాయకులు మేడిపల్లి శోభన్,సంగెం మాజీ ఎంపీపీ దొణికెల మల్లయ్య,మండల యూత్ నాయకులు,పది గ్రామాల పార్టీ నాయకులు, కార్యకర్తలు,సర్పంచ్ అభ్యర్థులు,వార్డు మెంబర్ అభ్యర్థులు,మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.