శ్రీ వీరహనుమాన్ దేవాలయంలో చోరీ
శంకర్ పల్లి,ఏప్రిల్ 04(జనం సాక్షి)శంకర్పల్లి మున్సిపల్ పరిధిలో గల హనుమాన్ నగర్ కాలనీలో ఉన్న శ్రీ వీర హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది.ఆలయ పూజారి శ్రీకాంత్ తెలిపిన వివరాల ప్రకారం తాను రోజు మాదిరిగానే శుక్రవారం ఉదయం 6 గంటలకు వచ్చి మధ్యాహ్నం 12 గంటలకి వెళ్లిపోయానని..అయితే శనివారం ఉదయం 4:40 నిమిషాల సమయంలో అదే కాలనీలో ఉంటున్న స్థానికులైన ఒకరు తనకు ఫోన్ చేసి సమాచారం అందించారు.పూజారి వెంటనే అక్కడికి వెళ్లి చూడగా గుడిలో ఉన్నటువంటి బీరువా తెరిచి ఉండటంతో వెంటనే స్థానికులకు మరియు పోలీసులకు సమాచారం అందించారు.బీరువాలో ఉన్నటువంటి మూడు గంటలు,ఒక శతకోపం, పంచలోహాల దుర్గాదేవి విగ్రహం,సుమారుగా మరియు 2500 నుంచి 3000 రూపాయలు పోయినట్టు తెలిపారు.పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు.


