నేటి విద్యార్థులే రేపటి పౌరులు
మహబూబాబాద్ ప్రతినిధి, (జనంసాక్షి): నేటి విద్యార్థులే రేపటి భావి పౌరులని మహబూబాబాద్ ఎమ్మెల్యే డా మురళీ నాయక్ గారు అన్నారు. సుమారు 54 లక్షల పియంశ్రీ నిధులతో పొనుగోడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నందు అదనపు తరగతి మరియు సైన్స్ ల్యాబ్ గదుల నిర్మాణం తదితర పనులకు ఎమ్మెల్యే డా భూక్యా మురళీ నాయక్ గారు, డిసిసి అధ్యక్షులు జన్నా రెడ్డి భరత్ చందర్ రెడ్డి గారితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సరైన విద్యతో పాటు పోషకాలతో కూడిన మధ్యాహ్న భోజనం అందించడం మన బాధ్యత అని చెప్పారు. ప్రతి పేద వాడికి విద్యను అందించడమే లక్ష్యంగా ప్రభుత్వ స్కూల్స్ పనిచేస్తున్నాయి అన్నారు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఏ సమస్యలున్నా తమ దృష్టికి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు మండల నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు అధికారులు పాఠశాల ఉపాధ్యాయుల బృందం విద్యార్థులు గ్రామ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.