వినయ్ రెడ్డి సోషల్ రెస్పాన్సిబిలిటీ

సామాజిక మాధ్యమాల పోస్ట్ కు స్పందించి రక్తదానం

ఆర్మూర్, మే 11 (జనంసాక్షి) : ఆర్మూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వినయ్ రెడ్డి సామాజిక మాధ్యమాల్లో అరుదైన రక్తం అవసరం ఉందని వచ్చిన పోస్ట్ కు స్పందించి రక్తదానం చేసి శభాష్ అనిపించుకున్నారు.జక్రాన్ పల్లి మండలానికి చెందిన జగడం నారాయణ
అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్ లోని మల్ల రెడ్డి నారాయణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.అరుదైన బి నెగిటివ్ రక్తం అవసరం ఉందని సామాజిక మాధ్యమాల్లో వచ్చిన పోస్టుకు స్పందించారు. వారి వివరాలను పూర్తిగా తెలుసుకొని హాస్పిటల్ కి వెళ్లి బాధితుడికి అవసరం మేరకు రక్తదానం చేశారు.

ప్రజ నాయకుడు అంటూ పలువురి కితాబు

వినయ్ రెడ్డి ఉదారత,మంచితనం,వ్యక్తిత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.ఉన్నత పదవిలో ఉండి సేవ చేయడం కాదని,పదవిలో లేకున్నా ఆపదలో ఉన్నవారిని ఆదుకుని మానవత్వాన్ని చాటుతున్నారు.కొందరు హాట్సాఫ్ సార్,మహా నాయకుడు,ప్రజల నాయకుడు అంటూ వినయ్ రెడ్డి రక్తదానం చేసిన ఫోటోలతో వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ ఖాతాల్లో షేర్ చేస్తూ అభినందనలు తెలుపుతున్నారు.ఆర్మూర్ నియోజకవర్గం ప్రజల సమస్యలపై దృష్టి సారిస్తూనే,సమాజం పట్ల బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్న ప్రజా నాయకుడు అంటూ పలువురు కితాబిస్తున్నారు.

తాజావార్తలు