*VRAల కు మద్దతు తెలిపిన PYLనేతలు*

బాల్కొండ జూలై 29 (జనం సాక్షి) నిజామాబాద్ జిల్లా  బాల్కొండ మండల కేంద్రంలో    తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని గత ఐదు రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న వీఆర్ఏ ల  కు బాల్కొండ లో సంఘీభావం తెలిపి మద్దతు తెలియజేయడం జరిగింది,
ఈ సందర్భంగా PYL జిల్లా ప్రధాన కార్యదర్శి సుమన్ మాట్లాడుతూ   తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా అసెంబ్లీ వేదిక గా వీఆర్ఏలలో దళితులు బీసీలు అనగారిన వర్గాలు ఉన్నాయని ప్రభుత్వ ఖజానాపై భారం పడ్డ కూడా వాళ్లకు పేస్కేల్ అమలు చేస్తామని వారసత్వ ఉద్యోగాల కల్పనలో పెన్షన్లలో న్యాయం చేస్తామని సుమారు ఏడాదిన్నర గడిచిపోయిన నేటికీ వారి సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని దీంతో వీఆర్ఏలు తమ డిమాండ్ల సాధనకై పోరాటబాట పట్టారని అన్నారు,  వీఆర్వో వ్యవస్థ రద్దు తో  పని భారం మీద పడినా కూడా పని చేస్తూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువచేసేందుకు నిరంతరం కృషి చేసిన వీఆర్ఏ ల పట్ల కేసీఆర్ ప్రభుత్వం మొండి గా వ్యవహరిస్తు ఇచ్చిన హమీలు కూడ అమలు చేయకుండా మరో దళిత ముఖ్యమంత్రి, దళితులకు మూడెకరాల హమీల మాదిరిగా దగా జేయజూస్తున్నదని వారు విమర్శించారు తక్షణమే వారి డిమాండ్లు పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ లో ఏడాదిన్నర క్రితం కేసీఆర్ ప్రకటించిన వెంటనే పాలాభిషేకం చేసిన వీఆర్ఏ లతోనే పాడె గట్టే పరిస్థితి తెచ్చుకోకుండా వారి సమస్య  పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో PYL ఆర్మూర్ ఏరియా  కార్యదర్శి తూర్పటి శ్రీనివాస్, నాయకులు కిషోర్,విజయ్ లు పాల్గొన్నారు.
Attachments area