VRA లకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

గోపాల్ పేట్ జనం సాక్షి జూలై (29)
గోపాల్ పేట్ మండల కేంద్రంలో తహశీల్దార్ కార్యాలయం ముందు చేపట్టిన VRA JAC నిరవదిక సమ్మేకు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు సంఘీభావం తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ వీఅర్ఏల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారికి వెంటనే పే స్కేల్ జీవోను అమలు చేసి 55 సం.రాల వయసు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలి అలాగే వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేసారు.వీఆర్ఏల పక్షాన కాంగ్రెస్ పార్టీ ఉంటుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలోఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ శివన్న,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అసెంబ్లీ వైస్ ప్రెసిడెంట్ కొంకి రమేష్,జనరల్ సెక్రెటరీ సుధాకర్ రావు,వార్డు మెంబర్ వెంకటయ్య,కాంగ్రెస్ నాయకులు దేవరాజు యాదవ్,లక్ష్మణ్,యువజన నాయకులు ప్రవీణ్,బాలకృష్ణ,బాలపీరు,బాలస్వామి, తదితరులు పాల్గొన్నారు