హ్యాట్సాప్ నేరేడుచర్ల ఎస్సై రవీందర్ సాబ్…

 

 

 

 

నేరేడుచర్ల (జనంసాక్షి) న్యూస్ . మండలం సోమరం గ్రామానికి చెందిన కోమర్రాజు సుస్మిత మూసి నదిలో గల్లంతైన సమయం నుండి నేరేడుచర్ల ఎస్ఐ రవీందర్ చేసిన కృషి మరవలేనిది అని స్థానికులు తెలిపారు. నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో మృతదేహం లభ్యం అవుతుందా అనే సందేశాలు వ్యక్తం అవుతున్న సమయంలో ఆమె తల్లిదండ్రులు మాత్రం తమ కూతురిని ప్రాణాలు లేకున్నా ఆమె మృతదేహం అయినా చూసేందుకు ఎస్ఐ రవీందర్ ను ప్రాధాయపడ్డారు. తల్లిదండ్రుల బాధలను గుర్తించిన ఎస్ఐ రవీందర్ సుస్మిత మృతదేహం కోసం రాత్రి 8 గంటల వరకు వెతికిన దొరకలేదు.ఆదివారం ఉదయం 6:00 గంటల నుండి గాలింపు చర్యలు చేపట్టారు. ఉదయం 10 గంటల సమయంలో మూసి అవతలి వైపు మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని తీసుకురావాలంటే కష్టతరంగా మారింది ఏమాత్రం చిన్న పొరపాటు జరిగిన మృతదేహం మళ్ళీ నీటి ప్రవాహం లో కొట్టుకు వెళ్లే అవకాశం ఉంది.ఎస్ఐ.రవీందర్ తనే స్వయంగా ఈత కొడుతూ అవతల ఒడ్డు కెళ్లి అవతల ఉన్న వ్యక్తులు సాయంతో తెప్పపై ఆ మృతదేహాన్ని తీసుకొని ఒడ్డుకు చేర్చారు. స్థానికులు పెద్ద ఎత్తున ప్రదేశానికి చేరుకొని ఎస్ఐ రవీందర్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాడు.ఎస్ఐ రవీందర్ చేసిన కృషిని స్థానికులు తల్లిదండ్రులు అభినందించారు.