రోడ్డు భద్రతపై పోలీసుల విస్తృత అవగాహన

రాష్ డ్రైవింగ్‌కు దూరంగా ఉండాలి
ఎస్ఐ భాస్కర్ రెడ్డి
భూదాన్ పోచంపల్లి, జనవరి 22 (జనం సాక్షి): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తున్న అరివ్ ఆలీవ్ కార్యక్రమంలో భాగంగా భూదాన్ పోచంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రమాదకర ప్రాంతాలను బ్లాక్ స్పాట్లుగా గుర్తించి విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీట్‌బెల్ట్ వినియోగించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపకూడదని, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదని, ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించాలని అన్నారు. అలాగే రాష్ డ్రైవింగ్‌కు పాల్పడితే ప్రమాదాలు తప్పవని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని, రహదారులపై ప్రయాణించే ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు పాటించి తమ ప్రాణాలను కాపాడుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


