వడ్లు జల్లి పట్టే మిషన్ లో ఇరుక్కుని మహిళా మృతి

 

 

 

 

 

 

 

 

సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టిన చేర్యాల ఎస్సై అపూర్వ రెడ్డి

చేర్యాల (జనంసాక్షి) మే 11 : సిద్దిపేట జిల్లాచేర్యాల మండలంలోని కాశగుడిసెల గ్రామానికి చెందిన షేక్ ఇమాంబీ (50) అనే మహిళ కూలీ కోసం వెళ్లి వడ్లు జల్లిపట్టే యంత్రంలో తల వెంట్రుకలు ఇరుక్కుని ప్రమాదవశాత్తు అక్కడికక్కడే మృతి చెందింది. గత నాలుగు సంవత్సరాల క్రితం మృతురాలి కుమారుడు గుండె పోటుతో మృతి చెందాడు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సంఘటన స్థలానికి చేర్యాల ఎస్ఐ గూడ అపూర్వ రెడ్డి చేరుకొని దర్యాప్తు చేపట్టారు.