యువకులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి
బోధన్, (జనంసాక్షి ) : యువకులు విద్యార్థులతో పాటు క్రీడలలో రాణించాలని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం బోధన్ మండలం పెగడాపల్లి గ్రామంలో ప్రీమియర్ లీగ్ సీజన్ -2 టోర్నమెంటును నిర్వహించారు. ఈ సందర్భంగా ముగింపు వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే యువకులను ఉద్దేశించి మాట్లాడారు. యువకులు విద్యతో పాటు క్రీడలలో రాణించాలని, క్రీడలలో గెలుపు ఓటములు సహజమే అని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యువకులకు పెద్దపీట వేయడంతో ఇప్పటికే వేలాది ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగిందన్నారు. కాగా యువకులు రానున్న ఎన్నికలలో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరారు. గుజరాత్ లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని కేవలం పెన్షన్ మాత్రమే అందిస్తున్నారన్నారు. కాగా సబర్మతి నది లాగానే రానున్న కాలంలో మూసీనదిని ప్రక్షాళన చేయడం జరుగుతుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హయాంలో అన్నివర్గాలకు సమన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. అనంతరం విజేతలకు ప్రైజ్ మనీతో పాటు ట్రోపీలని అందించారు. మొదటి విజేతకు గాధారి నవతేజ రెడ్డి స్పాన్సర్ చేసిన 25 వేల 555 రూపాయల చెక్కును, రన్నర్ ప్రైజ్ స్పాన్సర్ ఎస్ కె అహ్మద్ అందించిన 12 వేల 222 రూపాయలు అందించారు. ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి, రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, జిల్లా గ్రంధాలయ చైర్మన్ ఆంతిరెడ్డి రాజిరెడ్డి, టీపిసిసి డెలిగేట్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గంగాశంకర్, బోధన్ మండల అధ్యక్షుడు నాగేశ్వరరావు, సహకార సంఘం చైర్మన్ రాజారెడ్డి, విడిసి చైర్మన్ లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు మంద నాగరాజు, పోతరెడ్డి, టోర్నమెంట్ నిర్వాహకులు మోహన్, గణేష్, రాజు, సావేందర్, నరేష్, మనోజ్, భరత్, మేడిరవి, కృష్ణ, విజయ్, ముజీబ్, దేవరాజ్, అనిల్ రెడ్డి, సన్నిత్ రెడ్డి, యోగేష్, ప్రసాద్, శేఖర్, నూర్ సతీష్, బీరుగొండ, రఫిక్, మహేష్, బన్ను, వికాస్ రెడ్డి, లింగారెడ్డి, ఎస్టిడి రాజు, ఫయాజ్, శీను, రాజు, అశోక్, హైదర్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.