అంగన్వాడీ సెంటర్ లో ఘనంగా రక్షభందన్ వేడుకలు

share on facebook
గరిడేపల్లి, ఆగస్టు 12 (జనం సాక్షి): అన్నా చెల్లెళ్ళు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ఆప్యాయతలకు నిదర్శనం రక్షాబంధన్ అని అంగన్వాడీ టీచర్ పోకల వెంకమ్మ అన్నారు.మండలంలోని గానుగబండ అంగన్వాడీ కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ భారతదేశ సంస్కృతి సంప్రదాయలను  కాపాడుకోవాల్సిన ఆచరించాల్సిన బాధ్యత మనపై ఉన్నదన్నారు.  అంగన్వాడీ పిల్లలు ఒకరికి ఒకరు రాఖీలను కట్టి శుభాకాంక్షలు తెలుపుకొని  స్వీట్స్ పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు పిల్లలు, పిల్లల తల్లితండ్రులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.