ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష

share on facebook

 హైదరాబాద్‌: రెండోరోజు కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మెపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతాధికారులతో భేటీ అయ్యారు. ఈ భేటీలో రవాణా మంత్రి పువ్వాడ అజయ్‌తోపాటు రవాణా, పోలీసు, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఆర్టీసీ సమ్మెపై ఈ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోనున్నారు. సమ్మె నేపథ్యంలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై చర్చించనున్నారు. విధుల్లో చేరే విషయమై ఆర్టీసీ కార్మికులకు ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ శనివారం సాయంత్రంతో ముగిసిన సంగతి తెలిసిందే.

మరోవైపు ఆర్టీసీ కార్మికుల సమ్మె రెండో రోజు ఆదివారం కొనసాగుతోంది. సమ్మె విషయంలో ఇటు ప్రభుత్వం అటు కార్మికసంఘాలు పట్టువిడవడం లేదు. సమ్మె ఎన్నిరోజులు కొనసాగినా కార్మికులతో చర్చలు ఉండబోవని ప్రభుత్వం స్పష్టం చేస్తుండగా.. మరోవైపు సమ్మెపై వెనక్కి తగ్గేది లేదని కార్మికులు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం విధించిన డెడ్‌లైన్ ముగిసినా కార్మికులంతా సమ్మె కొనసాగిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే వరకు సమ్మె కొనసాగిస్తామని తేల్చిచెబుతున్నారు.

Other News

Comments are closed.