ఆ ఆరుగురు బ్యాట్స్‌మెన్‌ ది బెస్ట్‌: ఆకాశ్‌ చోప్రా

share on facebook

న్యూఢిల్లీ,నవంబర్‌13(జ‌నంసాక్షి): ఐపీఎల్‌ 2020 సీజన్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో బెస్ట్‌ ఎలెవన్‌ టీమ్‌ ఎంపిక చేసిన టీమిండియా మాజీ ఓపెనర్‌ ఆకాశ్‌ చోప్రా.. తాజాగా ది బెస్ట్‌ బ్యాట్స్‌మెన్‌ ఎవరో చెప్పాడు. తన యూట్యూబ్‌ చానెల్‌ వేదికగా ఈ సీజన్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన 6 బ్యాట్స్‌మెన్‌ను ఎంపిక చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఇందులో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌ మయాంక్‌ అగర్వాల్‌, విధ్వంసకర వీరుడు హార్దిక్‌ పాండ్యాలకు ఈ కామెంటేటర్‌ అవకాశం ఇవ్వలేదు. డివిలియర్స్‌ను ఉత్తమ ఆరో బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేసిన చోప్రా.. ఆర్‌సీబీ విజయాల్లో అతను కీలక పాత్ర పోషించాడన్నాడు. ఈ స్థానం కోసం విరాట్‌, మయాంక్‌ను పరిగణలోకి తీసుకున్నా.. చివరకు సౌతాఫ్రికా దిగ్గజాన్నే ఎంచుకున్నానని తెలిపాడు. ‘నంబర్‌ 6 కోసం మయాంక్‌ అగర్వాల్‌, విరాట్‌ కో/-లహీలను కూడా పరిగణలోకి తీసుకున్నా. కానీ చివరకు డివిలియర్స్‌నే ఎంచుకున్నా. కొంత మంది నన్ను ఏబీడీ ఆర్‌సీబీని విజేతగా నిలపలేదు కదా అని ప్రశ్నించవచ్చు. కానీ అది అతని పని కాదు. 2018 నుంచి అత్యధిక మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌లందుకున్న ఆర్‌సీబీ ఆటగాడు డివిలియర్స్‌. ఈ ఏడాది కూడా చాలా ఉత్తమ ప్రదర్శనలు కనబర్చాడు. జట్టుకు ఒంటి చేత్తో విజయాలందించాడు.’అని చోప్రా స్పష్టం చేశాడు. ఇక నాలుగు, ఐదు స్థానాల్లో ముంబై ఇండియన్స్‌ బ్యాట్స్‌మన్‌ ఇషాన్‌ కిషన్‌, సూర్య కుమార్‌ యాదవ్‌లను తీసుకున్న చోప్రా.. వారి ఆట ఆకట్టుకుందన్నాడు. ఇక ఇండియన్‌ ఏబీడిగా అలరించిన సూర్య కుమార్‌ యాదవ్‌ను ఆస్టేల్రియా టూర్‌కు ఎంపిక చేయకపోవడంపై అటు అభిమానులు, ఇటు మాజీ క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. చోప్రా కూడా సూర్యను ఎంపిక చేయాల్సిందని అభిప్రాయ పడ్డాడు. వరుస సీజన్లలో 500కు పైగా పరుగులు చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ను మూడో బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా పేర్కొన్న చోప్రా.. శిఖర్‌ ధావన్‌ రెరడో ఉత్తమ ఆటగాడిగా ఎంచుకున్నాడు. అతను బ్యాక్‌ టు బ్యాక్‌ సెంచరీలు అద్భుతమని కొనియాడు. ఇక వరుసగా నాలుగు హాఫ్‌ సెంచరీలు చేసిన శిఖర్‌ ధావన్‌ జట్టుకు అద్భుత విజయాలందించి ఫైనల్‌కు చేర్చాడు. కానీ కీలక ఫైనల్లో దారుణంగా విఫలమై తొలిసారి చాంపియన్‌గా నిలిచే బంగారం లాంటి అవకాశాన్ని చేజార్చుకున్నారు. ఇక ఈ సీజన్‌ ఆరెరజ్‌ క్యాప్‌ హూల్డర్‌ అయిన కేఎల్‌ రాహుల్‌ను చోప్రా నెంబర్‌ వన్‌ బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌గా ఎంపిక చేశాడు. ‘నెంబర్‌ వన్‌గా రాహుల్‌ను ఎంపిక చేశా. అతని జట్టు ప్లే ఆఫ్స్‌ చేరకపోవచ్చు.. కానీ ఆ జట్టు అద్భుత ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా ఆర్‌సీబీపై రాహుల్‌ ఆడిన (69 బంతుల్లో 132 నాటౌట్‌) ఇన్నింగ్స్‌ ఈ సీజన్‌లోనే అత్యుత్తమం’అని చోప్రా చెప్పుకొచ్చాడు. ఆకాష్‌ చోప్రా టాప్‌6/-ఖ బ్యాట్స్‌మెన్‌: కేఎల్‌ రాహుల్‌, శిఖర్‌ ధావన్‌, డేవిడ్‌ వార్నర్‌, ఇషాన్‌ కిషాన్‌, సూర్య కుమార్‌ యాదవ్‌, ఏబీ డివిలియర్స్‌

Other News

Comments are closed.