ఉన్నత చదువుల కోసం నిరుపేద విద్యార్థినికి చేయూత

share on facebook
సూర్యాపేట ప్రతినిధి (జనంసాక్షి):పెన్ పహాడ్ మండల పరిధిలోని అనంతారం గ్రామానికి చెందిన మామిడి అనిత, శంకర్ కుమార్తె మామిడి తేజస్విని అగ్రికల్చర్ బీఎస్సీ చదివేందుకు అర్హత సాధించింది.నిరుపేదలైన తల్లిదండ్రులు తమ కుమార్తె ఉన్నత చదువులు చదివించేందుకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ జిల్లా నాయకులు, డి క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ పట్టణ అధ్యక్షులు గండూరి కృపాకర్ వారికి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేసి ఆ కుటుంబానికి ధైర్యాన్నిచ్చారు.ఈ సందర్భంగా గండూరి కృపాకర్ మాట్లాడుతూ మంత్రి జగదీష్ రెడ్డి, వారి కుటుంబ సభ్యులు ఉన్నతమైన ఆశయంతో నెలకొల్పిన ఎస్ ఫౌండేషన్ ద్వారా ఎందరో నిరుద్యోగులకు ప్రత్యేక నిపుణులతో శిక్షణ తరగతులు, ఉచిత భోజన సౌకర్యం అందించారని అన్నారు.ఉచిత శిక్షణ పొందిన  అభ్యర్థుల్లో ఎంతో మంది ఉద్యోగాలు సాధించి స్థిరపడ్డారని పేర్కొన్నారు. ఎస్ ఫౌండేషన్ చేస్తున్న సేవలను ఆదర్శంగా తీసుకొని పలువురికి ఆర్ధిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు.విద్యార్థులు ఉన్నత ఆశయంతో ముందుకు సాగాలన్నారు.ఆర్థిక సాయం అందించినందుకు విద్యార్థిని తల్లిదండ్రులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో నూకల వెంకటరెడ్డి , రాచకొండ శ్రీనివాస్, తెరటపల్లి సతీష్ , జూలకంటి నాగరాజు, బజ్జురి శ్రీనివాస్, బేజగం ఫణి , డోగుపర్తి ప్రవీణ్, మట్టిపల్లి శ్రీధర్, ముదులగర్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.