ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు కరోనా

share on facebook

జిహెచ్‌ఎంసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే
హైదరాబాద్‌,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) :  తెలుగు రాష్ట్రాల్లో కరోనా డేంజర్‌ బెల్స్‌ మోగిస్తోంది. కరోనా కట్టడికి చర్యలు తీసుకున్నప్పటికీ రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. మరోవైపు అధికారులు, ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రజాప్రతినిధులు కరోనా తో ఆస్పత్రిలో చేరారు. కాగా ఇప్పుడు తాజాగా తెలంగాణకు చెందిన మరో ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. బెల్లంపల్లి నియోజక వర్గానికి చెందిన తెరాస ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య కరోనా బారిన పడ్డారు. ప్రస్తుతం ఆయన నిమ్స్‌ హాస్పిటల్‌ లో చికిత్స పొందుతున్నారు. ఎమ్మెల్యే తో పాటు ఆయన గన్‌ మెన్‌, ఇద్దరు కుటుంబ సభ్యులకు కూడా కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే తాజాగా జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో బన్సీలాల్‌ పేట డివిజన్‌లో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఎన్నికల ప్రచారం చేసారు.

Other News

Comments are closed.