ఎమ్మెల్సీ ఏకగ్రీవాల్లో టీఆర్‌ఎస్‌ జోష్‌..

share on facebook


` మహబూబ్‌నగర్‌లోనూ టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఏకగ్రీవం
మహబూబ్‌నగర్‌,నవంబరు 25(జనంసాక్షి): మహబూబ్‌నగర్‌ జిల్లా స్థానిక ఎమ్మెల్సీ స్థానాలు టీఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. ఇప్పటికే ముగ్గురు అభ్యర్థులు ఏకగ్రీవమవగా, తాజాగా కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి ఏకగ్రీవమయ్యారు. వీరిపై పోటీకి నిలిచిన స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ చెందిన అభ్యర్థులు మాత్రమే బరిలో మిగిలారు. ఈ నేపథ్యంలో వీరి ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్‌ అధికారి వెంకట్రావు అధికారికంగా ప్రకటించనున్నారు. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు కల్వకుంట్ల కవిత, పట్నం మహేందర్‌ రెడ్డి, శంభీపూర్‌ రాజు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Other News

Comments are closed.