కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శం

share on facebook

ప్రజలంతా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి
ప్రాదేశిక ఎన్నికల్లో టిఆర్‌ఎస్‌నే గెలిపించాలి
ప్రచారంలో ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి
పెద్దపల్లి,మే4(జ‌నంసాక్షి): పెద్దపల్లి టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఎదాసరి మనోహర్‌ రెడ్డి శనివారం కాల్వ కాల్వ శ్రీరాంపూర్‌ మండలంలోని జాఫర్‌ ఖాన్‌ పేటలో ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమం కోసం సిఎం కెసిఆర్‌ అనేక పథకాలు అమలు చేస్తున్నారని, కెసిఆర్‌ పాలన దేశానికే ఆదర్శంగా మారిందని ఆయన పేర్కొన్నారు. జడ్‌ పిటిసి, ఎంపిటిసి ఎన్నికల్లో కారు గుర్తుకే ఓటేసి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన కోరారు. ప్రతిపక్షాలకు ఓటేయడం వల్ల ఎటువంటి లాభం చేకూరదని ఆయన పేర్కొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కెసిఆర్‌ నేతృత్వంలోని టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం పాటుపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ ఎన్నికల ప్రచారంలో జడ్‌ పిటిసి అభ్యర్థి వంగల తిరుపతిరెడ్డి, ఎంపిటిసి అభ్యర్థి కొల్లూరి రమాదేవి రాజమల్లు, టిఆర్‌ఎస్‌ మండల పార్టీ అధ్యక్షుడు కొట్టే రవి, సర్పంచ్‌ దొమ్మటిశ్రీనివాస్‌, గ్రామ అధ్యక్షుడు సమ్మన్న,పురుషోత్తం, టిఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.
జిల్లా ఏర్పడ్డ తర్వాత తొలిసారి జరుగుతున్న జిల్లా ప్రాదేశిక నియోజకవర్గాల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ క్లీన్‌ స్వీప్‌ చేయడం ఖాయం అని, పదమూడు స్థానాలకు ఒక్కటీ తగ్గకుండా గెలుచుకొని పెద్దపల్లి జిల్లా పరిషత్‌ అధ్యక్ష పీఠాన్ని కైవసం చేసుకోబోతున్నట్లు దాసరి వెల్లడించారు.  ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఐదేళ్ల పాలన, చేపడుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలతో ప్రజలంతా సంతోషంగా, టీఆర్‌ఎస్‌పై సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారని అన్నారు.  పెద్దపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌ అధిక స్థానాల్లో గెలిస్తే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు. అన్ని మండలాల్లో జడ్పీటీసీ స్థానాలతో పాటు అత్యధికంగా ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుని ఎంపీపీ పీఠాలను టీఆర్‌ఎస్సే దక్కించుకుంటుంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత పాలన ప్రజలకు సంపూర్ణ విశ్వాసాన్ని కలిగించింది. అవినీతి రహిత పరిపాలన, ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు, అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను పకడ్బందీగా అమలు చేస్తూ.. ప్రజల మనసులను టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుచుకుంది. ఈసారి జడ్పీటీసీ అభ్యర్థులుగా మంచి వ్యక్తులను ఎంపికచేశాం. ప్రజలు అభ్యర్థులను చూసి కాదు.. పార్టీని చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సీఎం కేసీఆర్‌ సుదీర్ఘ రాజీకీయ అనుభవం కలిగిన  వ్యక్తి.. ఆయన దేశ రాజీకీయాలకే దిక్సూచిలా వ్యవహరిస్తున్నారు. సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెట్టేలా పనిచేయాలని కార్యకర్తకలు పిలుపునిచ్చారు. ప్రతీ ప్లలెను.. పట్టణాన్ని.. అభివృద్ధి చే సే దిశగా, గ్రావిూణ ప్రాంతాల్లోని నిరుద్యోగ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కెసిఆర్‌ చర్యలు చేపడుతున్నారు. పెద్దపల్లి అన్ని వనరులు కలిగిఉన్న జిల్లా అని, పెద్దపల్లి జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ జడ్పీటీసీ స్థానాలను అత్యధికంగా కైవసం చేసుకోవడం తథ్యం అని విశ్వాసం వ్యక్తం చేశారు.  రాబోయే కాలంలో పెద్దపల్లి జిల్లాలో మూడు పంటలకు సాగు నీరందబోవడం తథ్యం. ఇందులో ఎలాంటి సందేహం కూడా లేదన్నారు.

Other News

Comments are closed.