కెసిఆర్‌ మధ్యం పాలసీని వెనక్కి తీసుకోవాలని  కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం

share on facebook

ఖమ్మంబ్యూరో,అక్టొబర్‌6(జనంసాక్షి)
25శాతం ఆదాయాన్ని మద్యం ద్వారా రాబట్టాలనే కెసిఆర్‌ మద్యం పాలసీని తక్షణం వెనక్కి తీసుకోవాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటి ఆధ్వర్యంలో కెసిఆర్‌ దిష్టిబొమ్మ దగ్ధం చేయ్యడం జరిగింది.ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రసాద్‌, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బత్తుల లెనిన్‌, వేదగిరి శ్రీనివాసరావు మాట్లాడుతూ కెసిఆర్‌ ప్రతిపాదించిన నూతన మద్యం పాలసీ విధానం గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ కూలీల ఆదాయంకు గండికొట్టే విదంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే బెల్ట్‌ సాపులు విస్తరణ వలన గ్రామీణ ప్రాంతంలోని పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని రెక్కల కష్టంపై వచ్చిన ఆదాయం త్రాగుడుకే పెట్టే పరిస్థితులు ఏర్పడ్డాయని, పేదల కష్టార్జితంను డైరెక్టుగా ప్రభుత్వం, మద్య మాఫీయా దళారులు దోపిడి చేస్తున్నారని ఫలితంగా కూలీల కుటుంబాలు ఆర్ధికంగా చితికి విద్యా, వైద్యం, పౌష్టికాహారంకు దూరం అవుతున్నాయని, అనేక కుటుంబాలు భర్తలను కోల్పోయి ఒంటరి కుటుంబాలుగా మారుతున్నాయని అన్నారు.తక్షణం నూతన మద్యం పాలసీని రద్దు చేసి బెల్ట్‌ పాసులను రద్దు చేయాలని, ఆక్రమ మద్యం, సారాల నియంత్రణకు చర్యలు చేపట్టాలని, ప్రభుత్వమే మద్యం వలన జరిగే ప్రాణ నష్టం, ఆర్ధిక నష్టం గురించి ప్రచారం నిర్వహించాలని, ప్రజా సంఘాలు, సామాజిక సంఘాలతో కలిపి అవగాహన ప్రమాదం నిర్వహించాలనే డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో తాళ్ళపల్లి కృష్ణ, నండ్ర ప్రసాద్‌, నందిగామ కృష్ణ, నాదెండ్ల శ్రీనివాస్‌, తాళ్ళూరి వెంకటేశ్వర్లు, గుమ్మడి నాగేశ్వరరావు, మాదవరావు, కొమ్ము శ్రీనివాసరావు, సాయికుమార్‌, మధు తదితరులు పాల్గొన్నారు.

Other News

Comments are closed.