కేసీఆరే పెద్ద హిందువు:కేకే

share on facebook

హైదరాబాద్‌,నవంబరు 21(జనంసాక్షి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ చేసిన అభివృద్ధిని ఇంటింటికి వెళ్లి ప్రచారం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు అన్నారు. తెలంగాణ భవన్‌లో కేశవరావు విూడియా సమావేశంలో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేశామని చెప్పారు. ‘మనుషులంతా ఒక్కటే అన్నది టీఆర్‌ఎస్‌ విధానం. సీఎం కేసీఆర్‌ను మించిన హిందువు ఎవరూ లేరు. అనేక సంవత్సరాలు సామాజిక న్యాయం గురించి మాట్లాడినం. టీఆర్‌ఎస్‌ పార్టీ జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సామాజిక న్యాయం పాటించింది. 150 సీట్లలో 85 సీట్లు వెనుకబడిన వర్గాలకే కేటాయించామని’ కేశవరావు తెలిపారు. ‘ఇటీవల హైదరాబాద్‌ వరదలను చూసి సీఎం కేసీఆర్‌ చలించిపోయారు. తక్షణ సాయంగా కుటుంబానికి రూ.10వేల రూపాయలు ఇస్తున్నారు. బాధితులకు సాయం చేయకుండా బీజేపీ అడ్డుకుంది. సంతకం ఫోర్జరీ చేశారంటున్న బండి సంజయ్‌ వరద సాయాన్ని ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలి. కేంద్రంలో బీజేపీ వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, బీహార్‌ తదితర రాష్ట్రాల్లో దళితులు, మహిళల విూద ఎన్ని దాడులు జరుగుతున్నాయో చూస్తున్నామని’ కేకే పేర్కొన్నారు.

Other News

Comments are closed.