గ్రామస్థాయిలోనే ఇక వివాహ రిజిస్టేష్రన్లు 

share on facebook

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌ల ప్రభావం
తగ్గుతున్న బాల్య వివాహాలు
హైదరాబాద్‌,జూలై30 (జనం సాక్షి): కళ్యాణలక్ష్మి, షాదీముబారక్‌లతో బాల్యవివాహాలు తగ్గాయని లెక్కలు చెబుతున్నాయి. దీనికితోడు వివాహాలకు సంబంధించి వివరాలను పక్కాగా సమర్పించాల్సి రావడంతో బాల్య వివాహాలకు దూరంగా ఉంటున్నారు. వివాహాల రిజస్టేష్రన్‌లతో గ్రావిూణ ప్రాంతాల్లో ఈ మ్యారేజ్‌ సర్టిఫికెట్ల జారీతో బాల్య వివాహాలకు చెక్‌ పడుతోంది. వధూవరుల వయసు 18, 21 ఉంటేనే మ్యారేజ్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. అమ్మాయి, అబ్బాయిల వయసులో తేడా ఉంటే మ్యారేజ్‌ సర్టిఫికెట్లను ఇవ్వడానికి నిరాకరించడమే కాకుండా చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాలు  ఉన్నాయి. దీంతో వివాహానికి కనీస వయసు ఉండి అన్ని సక్రమంగా ఉంటేనే కార్యదర్శులు మ్యారేజ్‌ సర్టిఫికేట్లు జారీ చేస్తారు. గ్రామాల్లో కార్యదర్శులు అందించే సర్టిఫికెట్లతో దొంగ వివాహాలకు అడ్డుకట్ట పడనుంది. ఒక సారి అయిన వివాహానికి మరోసారి వివాహ నమోదు ఇక కుదరదు. దీంతో గ్రామాల్లో అసలైన వివాహాలు ఎన్ని జరుగుతున్నాయన డానికి పక్కా లెక్క దొరుకుతుంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ పథకాలకు అసలైన లబ్దిదారులకు లాభం చేకూరుతుంది. ప్రభుత్వ సాయం పొందాలంటే పెళ్లిళ్ల లెక్క ఇక నుంచి పక్కాగా చేపట్టనున్నారు. వధూవరు లకు మ్యారేజి సర్టిఫికెట్‌లు తప్పనిసరి కానుంది. వివాహ నమోదును ఖచ్చితంగా చేయించు కోవాలన్న నిబంధనను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడానికి శ్రీకారం చుట్టడంతో కూడా బాల్యవివాహాలకు కళ్లెం పడుతోంది.  వివాహ నమోదు, మ్యారేజీ సర్టిఫికెట్ల జారీతో బ్యాల వివాహాలకు చెక్‌ పడనుంది. దొంగ వివాహాలకు కూడా ఇక చెల్లుచీటి పలుకనుంది. మాతా శిశు మరణాలను అరికట్టేందుకు అడుగులు పడ నున్నాయి. ఇకపోతే వివాహ రిజిస్టేష్రన్‌ కోసం గ్రావిూణ ప్రాంతాల నుంచి పట్టణాల్లో ఉండే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల వరకు ఇక వెళ్లాల్సిన అవసరం లేదు. గ్రామ పంచాయతీ సెక్రెటరీలకే ఆ బాధ్యతలను అప్పగించారు. మ్యారేజీ సర్టిఫికెట్లు జారీ చేయడానికి జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలకు చెందిన పంచాయతీ కార్యదర్శులు ఆ బాధ్యతలు చేపట్టనున్నారు. వివాహం చేసుకున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వివాహ నమోదుతో పాటు మ్యారేజీ సర్టిఫికెట్‌ పొందాల్సి ఉంటుంది. ఈ సర్టిఫికెట్‌ కోసం నమోదు చేసుకున్న వారికి వయసు వివరాలను, సాక్షులను, ధువ్రపత్రాలను పరిశీలించిన విూదట అన్ని సవ్యంగా ఉన్నాయని గ్రహించి తరువాతనే పంచాయతీ కార్యదర్శి మ్యారేజ్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. వివాహం చేసుకున్న వధూవరులకు ఆధార్‌ కార్డు జిరాక్స్‌ కాపీలు, వివాహపత్రిక, పెళ్లి పొటోలు, వయసు ధ్రువీకరణ పత్రాలు, ఇద్దరు సాక్షుల సంతకాలతో కూడిన అప్లికేషన్‌ ఫాంను గ్రామ పంచాయతీ కార్యదర్శికి అప్పగిం చాలి. వివాహం జరిగిన 90 రోజులలో పంచాయతీ కార్యదర్శులకు వివాహ నమోదు కోసం అప్లికేషన్‌ సమర్పించాల్సి ఉంటుంది. చదువుకున్న వారైతే మెమోలు చదువురాని వారు డాక్టర్ల చేత అందించిన వయసు ధ్రువీకరణ పత్రాలు అందించాలి. అప్లికెషన్లు స్వీకరించిన కార్యదర్శులు వివాహతంతు పై విచారణ ప్రారంభిస్తారు. విచారణలో అన్నీ సవ్యంగా ఉంటే మూడు రోజుల్లోనే సర్టిఫికేట్ల జారీ చేస్తారు. వివాహం జరిగిన నెలలోపు మ్యారేజీ సర్టిఫికేట్‌ పొందని వధూవరులు రూ.100 రుసుం చెల్లించి సర్టిఫికెట్‌ పొందడానికి అవకాశం ఉంటుంది. గ్రామ పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే సర్టిఫికెట్లు కళ్యాణలక్ష్మి, షాదీముబా రక్‌ లబ్దిదారులకు లబ్ది చేకూరుతుంది.  గ్రావిూణ స్థాయిలో మ్యారేజ్‌ సర్టిఫికెట్లను అందించడం వల్ల బాల్య
వివాహాలు వంటి సామాజిక దురాచారానికి అడ్డుకట్ట వేయవచ్చని అధికారులు కూడా భావిస్తున్నారు.

Other News

Comments are closed.