చంద్రబాబు ఖబర్దార్‌.. విూ ఎమ్మెల్యేలకు చెప్పు 

share on facebook

– చంద్రబాబుకు వైసీపీ ఎమ్మెల్యే వార్నింగ్‌
అమరావతి, జులై23(జ‌నంసాక్షి) : ఏపీ అసెంబ్లీలో మంగళవారం అధికార, ప్రతిపక్ష పార్టీల సభ్యుల మధ్య మాటల యుద్ధం సాగింది. ఒకరిపై ఒకరు మాటల తూటాలు పేల్చుకున్నారు. ఈ నేపథ్యంలో బీసీలకు కమిషన్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసే సమయంలో వాగ్వివాదం జరిగింది. టీడీపీ సభ్యులు కమిషన్‌ బిల్లును అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో..  ఈ సందర్భంగా సభలో కోటంరెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ సభ్యులు తమ ప్రవర్తనతో ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావద్దని కోరారు. సభలో ఉన్న పరిస్థితి చూస్తే చాలా బాధగా ఉందని, సంతోషంగానూ ఉందని అన్నారు. సంతోషం దేనికంటే గతంలో ఎప్పుడూ లేనివిధంగా ప్రతిపక్షానికి అవకాశం కల్పిస్తూ ప్రజాస్వామ్యానికి కొత్త అర్థం చెబుతున్నామన్నారు. ఐదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు తమకు సభలో మాట్లాడే అవకాశం ఇవ్వలేదని.. అధ్యక్షా… మైకు అంటూ అరవాల్సి వచ్చేదని ఆయన అన్నారు. గవర్నర్‌ వీడ్కోలు సభలో నరసింహన్‌ మాట్లాడుతూ.. జగన్‌ అద్భుత ముఖ్యమంత్రి అని, రాష్ట్ర ప్రజలంతా జగన్‌ పాలనలో ఆనందంగా ఉన్నారని ఆయన చేసినవ్యాఖ్యలను ఆయన గుర్తుచేశారు. ఈ ప్రభుత్వానికి మంచిపేరు రావడం టీడీపీ చూసి తట్టుకోలేకపోతోందని.. దీన్ని ఓర్చుకోలేక టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు నాయుడు ఖబర్దార్‌.. విూ సభ్యులకు చెప్పు.. ఖబద్డార్‌ చంద్రబాబు.. అంటూ కోటంరెడ్డి వ్యాఖ్యలు చేశారు. గతంలో ఇంతకంటే దారుణంగా జగన్మోహన్‌ రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసి.. చప్పట్లు చరిచిన వాళ్లు ఇప్పుడూ అదే పద్ధతిని కొనసాగిస్తున్నారని, అందుకే మళ్లీ చెబుతున్నా ఖబర్దార్‌ చంద్రబాబు నాయుడు, విూ సభ్యులకు జాగ్రత్త అని చెప్పాలని కోటిం రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Other News

Comments are closed.